Kalikota–Odedu Bridge Delay Causes Severe Hardship to Public
కలికోట ఓడేడు వంతెన నిర్మాణం కల సహకారం అయ్యేనా.
ప్రయాణికుల అవస్థలు పాలకులకు కనిపించడం లేదా?
కనీసం మట్టి రోడ్ నిర్మాణం చేసే దిక్కు లేదా?
ఎలుకటి రాజయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం కలికోట ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో ఉన్న అంతర్ జిల్లా వంతెన నిర్మాణం సహకారం అయ్యేనా? అని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ పాలకులను ప్రశ్నించారు ఈ సందర్బంగా ఆయన అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన ను పరిశీలించి మాట్లాడుతూ సుమారు 8సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం 47 కోట్ల అంచనాతో ప్రారంభించిన వంతెన పనులు నేటికీ పూర్తికాక పోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. గత సంవత్సరం అట్టి టెండర్ రద్దు చేసి,మళ్ళీ నూతన టెండర్ సుమారు 60 కోట్ల రూపాయలతో చేసిన, టెండర్ దక్కించుకున్న సదరు సంస్థ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టకపోవడం సరైంది కాదని,పాలకుల నిర్లక్ష్యం,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా హనుమకొండ పరకాల, గోదావరిఖని, పెద్దపల్లి మంచిర్యాల కు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకోవాల్సిన పరిస్థితి దాపూరించిందని, మానేరులో ద్విచక్ర వాహనదారులు నెట్టుకుంటూ,పాదాచారులు కాలి నడకన నడుస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని కనీసం మట్టి రోడ్డు ఏర్పాటు చేసే నాధుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ్యులు గండ్ర సత్య నారాయణ రావు, కాంట్రాక్టర్ లు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేసే విధంగా, అదేవిదంగా తాత్కాలిక మట్టి రోడ్ ఏర్పాటు చేసి ప్రయాణికులు బాధలు తీర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల తిరుపతి గౌడ్, మేనం రాజు, ఎండీ రజాక్, మెడిపెల్లి మురళి, కాసాని ఐలు మల్లు తదితరులు పాల్గొన్నారు..
