Concerns Over Bhoobharathi Act Impact on Farmers
భూభారతి చట్టంలో విలేజి సర్వేయర్లతో రైతుల కష్టాలు తీరేనా
ఎన్ని ప్రభుత్వ చట్టాలు మారిన రైతులకు న్యాయం జరగడం లేదు
ఈ ప్రభుత్వం హామీలతోయువకులను రైతులను మోసం చేస్తుంది
ధర్మ సమాజ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలో భూపాలపల్లి జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లకు 200 మందికి శిక్షణ ఇచ్చి 170 మందిని సెలెక్ట్ చేసుకొని, రైతుల సమస్యలు పరిష్కరించాలని సీ.ఎం చేతుల మీదుగా వారికి లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపిక చేసినారు. కానీ విలేజికి ఇద్దరిని కేటాయించి 40 వేల
పారితోషకం ఇవ్వడానికి గవర్నమెంటు నిర్ణయించింది. వీరికిచ్చిన లైసెన్స్ కాలపరిమితి రెండు సంవత్సరాలు కొందరికి ఒక సంవత్సరం అయిపోయింది ఆ విలేజిలో సర్వే రెండు మూడు నెలలైనా జరగవచ్చు అందుకు యువకులు ముందుకు రావడం లేదు నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటే భవిష్యత్తులో వీరికి ఉద్యోగ భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కనుక అలా చేయలేదు. అయినా వీరిని వీధుల్లోకి తీసుకోకపోవడం వల్ల నిజమైన రైతుల భూములు గతంలో రెవెన్యూ వారు .చేసిన తప్పుల వల్ల వేరే వారి పేరు మీదికి మారాయి .సంవత్సరాలు గడుస్తున్న వారికి రైతుబంధు కానీ రైతు భరోసా కానీ అందడం లేదు. అర్హత కలిగిన రైతులకు వారి భూమి వారి పేర పట్టాకు ఎక్కి ఉంటే రైతు భరోసా కింద డబ్బులు జమ అయ్యి ఉండేవి. ఈ రైతు భరోసా నిధుల విడుదల వల్ల కొంతమంది రైతులు సంతోషపడుతున్నారు. కొంతమంది రైతులు దుఃఖపడుతున్నారు. ఈ ప్రభుత్వం యువకులను, రైతులను మోసం చేస్తుంది. హామీలు ఇచ్చాడు తప్ప అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకు వచ్చే ఎలక్షన్లలో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు అని ధర్మ సమాజ్ పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం
