రంగంలో త్రిబుల్‌ ఆర్‌లు!

https://epaper.netidhatri.com/view/356/netidhathri-e-paper-23rd-aug-2024%09

`ఖైరతాబాద్‌ కొత్త బాద్‌షా ఎవరు?

`ఖైరతాబాద్‌లో రసవత్తరంగా రాజకీయం.

`ఆది నుంచి రెడ్డిలకు కంచుకోట.

`14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు రెడ్లే గెలిచారు.

`ఇప్పుడు ముగ్గురు అదే కోటా!

`మూడు పార్టీల నుంచి ముగ్గురు రెడ్డీలు.

`బిఆర్‌ఎస్‌ నుంచి మన్నె గోవర్ధన్‌ రెడ్డి.

`కాంగ్రెస్‌ నుంచి డాక్టర్‌. రోహిన్‌ రెడ్డి

`బిజేపి నుంచి ఇంద్రసేన్‌ రెడ్డి

`ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక పక్కా!

`అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది!

`ముగ్గురు రెడ్డిల మధ్య రసవత్తరపోరు జరగనుంది.

`రాజకీయం అప్పుడే మొదలైంది.

`దానం పై వేటు పక్కా?

దానం అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటి.

`ఉద్యమ నేపథ్యం మన్నె సొంతం.

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో రోహిన్‌ రెడ్డికి సాన్నిహిత్యం.

`బిజేపిలో పెద్దలందరికీ ఇంద్రసేన్‌ రెడ్డి ఇష్టం.

`ముగ్గురికి పార్టీల పరంగా ఎదురులేదు.

`అసమ్మతి రాగాలు అసలే లేవు.

`దానం స్థానం భర్తీ ఎవరు చేస్తారు?

`ఖైరతాబాద్‌ ను ఎవరు ఏలుతారు?

`అధికార కాంగ్రెస్‌ కు అనుకూలమా?

`మన్నెకు సానుభూతి కలిసొచ్చే అంశమా?

`ఇంద్రసేన్నకు బిజేపి బలం సరిపోయేనా!

`తెలుగు దేశం, జనసేన ఇంద్రసేన్‌కు తోడు నిలిచేనా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆదిపత్య రాజకీయాల కోసం పాకులాడే ఒక నాయకుడి వ్యవహర శైలి వల్ల పార్టీలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యాయో…ఆ నాయకుడి మూలంగా రాజకీయాలు ఎలా భ్రష్టుపడుతున్నాయో చెప్పడానికి చక్కని సాక్ష్యం ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను చూస్తే అర్ధమౌతుంది. ఆయన తన రాజకీయం స్వార్ధం కోసం ఏదైనా చేయగలడు. అది ఇంత కాలం చెల్లింది. కాని ఇక నుంచి చెల్లదని తేలిపోయింది. ఉద్యమ కాలంలో తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించినా, తర్వాత కాలంలో బిఆర్‌ఎస్‌ కూడా ఆయనను ఆదరించింది. కాని ఆయనకు ఆ కృతజ్ఞత వుండదని మరోసారి తేలిపోయింది. దానం నాగేందర్‌ వ్యవహరశైలి అందరికీ తెలిసిందే. ఎక్కడ అధికారముంటే అక్కడ వుండాలనుకుంటాడు. ఆయా రాజకీయ పార్టీల అండతో రాజకీయం చేస్తుంటాడు. పదవులు పొందుతుంటాడు. అయినా ఆ పార్టీల మీద ఆయన ఏనాడు పూర్తి స్ధాయి కృతజ్ఞత ప్రదర్శించిన సందర్భం ఎక్కడా కనిపించడు. ఆయన రాజకీయ ఓనమాలు నేర్చిన కాంగ్రెస్‌ పార్టీని కూడా రెండుసార్లు కాదనుకున్నాడు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ పంచన చేరాడు. 1999 ఎన్నికల్లో అనూహ్యమైన అవకాశం వచ్చిన దానం నాగేందర్‌ ఎమ్మెల్యే అయ్యారు. కాని రాజకీయ సమీకరణాల నేపధ్యంలో ఆయనకు 2004 ఎన్నికల్లో టికెట్‌ లభించలేదు. దాంతో ఆయన కాంగ్రెస్‌ వీడి తెలుగుదేశంలో చేరాడు. అప్పటికప్పుడు నామినేషన్ల చివరి రోజు తెలుగుదేశంపార్టీ భిఫామ్‌ ఇచ్చింది. ఆ కృతజ్ఞత ఆయనకు లేకుండా పోయింది. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. తన అనైతికను ప్రదర్శించాడు. తన అతివిశ్వాసంతో కొంప ముంచుకున్నాడు. తర్వాత 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి మంత్రి అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని తుంచే ప్రయత్నం పలు సార్లు చేశారు. కేవలం మంత్రి పదవి కోసం తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేశాడు. 20014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ను వీడి బిఆర్‌ఎస్‌లో చేరాడు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిన దానంను బిఆర్‌ఎస్‌లోకి తీసుకున్నప్పుడు అందరూ వ్యతిరేకించారు. అయినా కేసిఆర్‌ వాటిని లెక్క చేయకుండా దానంకు ప్రాదాన్యతనిస్తూ వచ్చారు. 2018, 2024 ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి గెలిపించారు. అయినా దానం తీరు మారలేదు. ఆయన వివాదాలు ఆపలేదు. తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరి, మళ్లీ తన పాత దానంను చూపించి రాజకీయం చేయాలనుకున్నాడు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముందు ఆయన పప్పులు ఉడకడంలేదు. గత శాసన సభ సమావేశాల్లో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను నిండు అసెంబ్లీలో దానం తిట్ల దండకం అందుకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెనకేసుకొచ్చారు. కాని హైడ్రా విషయంలో దానం అనుసరిస్తున్న తీరుతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కోపం వచ్చినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దానం మీద అనర్హత వేటు వేస్తేనే ఈ తలనొప్పి తగ్గుతుందన భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎట్టిపరిస్దితుల్లోనూ దానం మీద వేటు పడే అవకాశం వుందని అర్ధమౌతోంది. దాంతో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అలెర్టు అయ్యాయి. నియోజకవర్గం మీద పట్టు సాదించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఎట్టిపరిస్దితుల్లోనూ ఉప ఎన్నికలు రానున్న సంకేతాలు కనిపించడంతో బిఆర్‌ఎస్‌ తన స్దానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది.

ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, ఉద్యమ కారుడు మన్నె గోవర్ధన్‌రెడ్డికి ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నియోజకవర్గం చూసుకొమ్మన్నారు. ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా సిద్దంగా వుండమని మన్నెకు సూచించారు. దాంతో మన్నె గోవర్ధన్‌ రెడ్డి క్షేత్రస్ధాయిలో క్యాడర్‌ను కలుపుకుంటూ, ప్రజలను కలుసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖైరతాబాద్‌లో బిఆర్‌ఎస్‌ బలంగా వుంది. కాకపోతే 2014లో బిఆర్‌ఎస్‌ ఓటమిపాలైంది. తర్వాత రెండు ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్‌ గెలిచింది. అక్కడ మన్నెగోవర్ధన్‌ రెడ్డి బలమైన నాయకుడుగా వున్నారు. నిజానికి 2014లోనే మన్నె గోవర్ధన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే అప్పుడే గెలిచేవారు. కాని ఆయనకు ఇవ్వలేదు. తర్వాత కాలంలో దానం నాగేందర్‌ పార్టీలో చేరడంతో ఆయనకు టికెట్‌ ఇస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో దానంను పక్కన పెట్టి మన్నె గోవర్ధన్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తారన్న ప్రచారం జోరుగానే సాగింది. కాని ఆఖరు నిమిషంలో మళ్లీ మన్నెకు నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల్లో మన్నె గోవర్ధన్‌ రెడ్డికి మంచి పేరుంది. పార్టీకి విదేయుడుగా మంచి గుర్తింపు వుంది. ప్రజల్లో కూడా మన్నె గోవర్ధన్‌రెడ్డికి మంచి నాయకుడన్న అభిప్రాయమే వుంది. ఖైరతాబాద్‌ బిఆర్‌ఎస్‌లో కార్యకర్తల బలం బాగానే వుంది. ఖైరతాబాద్‌కు తప్పకుండా ఉప ఎన్నిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నదే. అందువల్ల ఆయన సులువుగానే గెలిచే అవకాశాలు లేకపోలేదు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎలాగూ దానం నాగేందర్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశం వుండదు.

ఆయనపై అనర్హత వేటు పడితే, కొన్ని సంవత్సరాల పాటు నిశేదం కూడా విధించే అవకాశం వుంది. అందువల్ల ఆ స్ధానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మంచి పేరున్న వైద్యుడు రోహిన్‌ రెడ్డికి కేటాయించినట్లే అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే ఖైరతాబాద్‌ టికెట్‌ ఆయనకే అని ఆఖరు వరకు ప్రచారం జరిగింది. ఆఖరు నిమిషంలో ఆయనకు ఖైరతాబాద్‌ టికెట్‌ కాకుండా, అంబర్‌ పేట నుంచి పోటీ చేయించారు. అక్కడ కూడా ఆయన మంచి ఓట్లే సాధించారు. కాకపోతే ఆయన నివాసం ఖైరతాబాద్‌లో వుంటుంది. ప్రజల్లో గుర్తింపు కూడా ఇక్కడే ఎక్కువగా వుంది. ఉప ఎన్నికలో డాక్టర్‌. రోహిన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే గెలుపు ఖాయమన్నది తెలుస్తోంది. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఆయన ప్రజలకు సుపరిచితుడు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు వుంది. ఒక వేళ ఉప ఎన్నిక వస్తే రాష్ట్ర యంత్రాంగమంతా అక్కడే వుంటుంది. అదికార పార్టీకి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా చేసే ప్రచారం కలిసి వస్తుంది. సహజంగా ఉప ఎన్నికలంటే అదికారపార్టీకే ఎక్కువ విజయావకాశాలు వుంటాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా వుండే నేత రోహిన్‌రెడ్డి కావడం వల్ల ఖైరతాబాద్‌ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చే అవకాశం వుంటుంది. నియోజకవర్గంలో పెండిరగ్‌ పనులే, కొత్త కొత్త అభివృద్ది కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టే అవకాశం వలిసి వస్తుంది. అందువల్ల ప్రజలు కూడా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపించే అవకాశం లేకపోలేదు.

ఇక బీజేపి పార్టీ నుంచి ఆ పార్టీలో అందరికీ ఇష్టమైన నేత ఇంద్రసేన్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించే అవకాశాలున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరగుతోంది.

ఖైరతాబాద్‌లో బిజేపి కూడా బలంగా వుంది. 2014లో కూడా అక్కడి నుంచి బిజేపి ఎమ్మెల్యేగా చింతల రాంచంద్రారెడ్డి గెలుపొందారు. హైదరాబాద్‌లో మొదటి నుంచి బిజేపి బలంగానే వుంది. కాని ఇప్పుడు మరింత బలం పుంజుకున్నది. మరో వైపు బిజేపితోపాటు తెలుగుదేశం, జనసేనలు కలిసి కేంద్రంలో అధికారంలో వున్నాయి. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే మాత్రం తప్పకుండా ఆ రెండు పార్టీలు బిజేపి మద్దతు పలికే అవకాశం వుంది. సహకరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత శాసన సభ ఎన్నికల్లోనూ బిజేపి జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ మూడు పార్టీలు కలిస్తే, ఖైరతాబాద్‌లో బిజేపి విజయం నల్లేరు మీద నడకే కావొచ్చు. గతంలో బిజేపి గెలిచిన సందర్భాలున్నాయి. బిజేపి, తెలుగుదేశం కలిసిన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్‌లో బిజేపి సీట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో ఏకంగా ఐదు సీట్లు గెలిచిన సందర్భం కూడా వుంది. ఇప్పుడు కూడా జతకడితే ఖైరతాబాద్‌ సీటు బీజేపి ఖాతలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *