కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి చౌకబారు పనులు మానుకుంటే మంచిది
యూత్ నాయకులు జానపట్ల విష్ణు
మంగపేట-నేటిధాత్రి
మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఎస్సీ కాలనీ లో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టిలోకి వచ్చారని శుక్రవారం రోజున కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.ఇదంతా అబద్ధం స్టేట్మెంటు రాజుపేట ఎస్సీ కాలనీ నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరలేదు అని యూత్ నాయకులు జానపట్ల విష్ణు అన్నారు. ములుగు లో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ములుగు లో అన్ని మండలాల ప్రజలు చాలావరకు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అది తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నే ఫోటోలు తీసి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు కాంగ్రెస్ లోకి చేరారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు.ఇదంతా అబద్ధపు ప్రచారము ఇక్కడున్న ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచిన చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రజలకు తెలిసిందని ఈసారి ములుగు నియోజకవర్గంలో బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే గా బడే నాగజ్యోతి ని గెలిపించడం ఖాయమనీ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇలాంటి చౌకబారు పనులు మానుకుంటే మంచిదని అన్నారు.