# రూ.7.80 లక్షల నగదు కాజేసిన చేసిన దుండగులు.
# మూడు రోజులు గడవకముందే మరో సంఘటన..
# పోలీసులకు సవాల్ గా వరుస దొంగతనాలు.
నర్సంపేట,నేటిధాత్రి :
పుణ్యం కోసం జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది ఈ సంఘటన నర్సంపేట పట్టణంలోని సాయినగర్‌లో కాలనీలో బుదవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ సుంకరి రవి కుమార్ ,బాధిత కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం మొలుగూరి నాగేందర్ కుటుంబం పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో గల సాయినగర్ కాలనీలో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని
కొత్తకొండ జాతర జరుగుతున్నది.కాగా నాగేందర్ కొత్తకొండ జాతర దగ్గర జాయింట్ వీల్ వ్యాపారం నిర్వహిస్తున్న క్రమంలో నాగేందర్ కుటుంబంతో సహా జాతరకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులకు నాగేందర్ సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ రవి కుమార్,ఎస్సై రవి పోలీసుల బలగంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు రూ.7 లక్షల నగదు కాజేసినట్టు గుర్తించారు.బాధితుడు నాగేందర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుంకరి రవి కుమార్ తెలిపారు.
# మూడు రోజులు గడవకముందే మరో సంఘటన..
నర్సంపేట పట్టణంలో ఐదు ఏటీఎం లను పగలకొట్టి చోరీలకు యత్నించిన ఘటన జరిగి మూడు రోజులు గడవకముందే భారీగా దొంగతనం జరుగడం పట్టణంలో ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.నిత్యం పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరిగతున్న వరుసగా దుండగులు దొంగతనాలు పాల్పడడం భయాన్ని రేకెత్తిస్తోందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
# పోలీసులకు సవాల్ గా వరుస దొంగతనాలు…
నర్సంపేట పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారాయి.గత మూడు రోజులుగా క్రితం పట్టణంలో గత మూడు రోజుల క్రితం పట్టణానికి చెందిన ఒక యువకుడు ఐదు ఏటీఎం లను పగలకొట్టి చోరీలకు యత్నించగా సమాచారం మేరకు అప్రమత్తమైన స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించారు.కాగా టౌన్ సీఐ రవి కుమార్,ఎస్సై రవి, కానిస్టేబుల్స్ అక్బర్ పాషా,రమేష్,శ్రీధర్ లను అభినందించిన డీసీపీ రవీందర్ సిపి ఆదేశాల మేరకు వారికి రివార్డులు అందించారు.అది జరిగిన రెండో రోజే ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి భారీగా నగదును దోచుకెళ్లడం ఇప్పుడు పోలీసులకు మారింది.సమాచారం తెలుసుకున్న టౌన్ సీఐ రవి కుమార్,ఎస్సై రవి అధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనానికి సంబందించిన ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నాలు చేశారు.