*పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం*
*కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
శాయంపేట నేటిధాత్రి:
పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆడబిడ్డల వివాహా లకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకా లను అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అర్హులైన 57 మంది లబ్ధిదారు లకు రూ.57,06,612 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మరియు వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 32 మందికి రూ.10,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోం దని, సామాజిక సమానత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయా లని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు శాయంపేట నియోజక వర్గంలో అమలు చేయను న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మండలంలో ని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ కార్య క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
