బి.ఆర్.ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యం

*కుల వృత్తులకు, చేతివృత్తులకు పునర్జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది

*సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రజకులకు న్యాయం జరిగింది

*కోనరావుపేట మండలం మల్కపేటలో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు వ్యాఖ్యలు

*చల్మెడకు మద్దతు తెలుపుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించిన మండల రజక సంఘం సభ్యులు

కొనరావుపేట, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయని, అందుకే మళ్ళీ ఒకసారి కారు గుర్తుపై ఓటేసి సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు పిలుపునిచ్చారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో గురువారం మండల రజక సంఘం సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ
ఉమ్మడి రాష్ర్టంలో వివక్షకు గురైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలో జీవం పోసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఈ క్రమంలొనే రజకులకు ఉచిత విద్యుత్ తో పాటు బిసి బంధులో అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరెవరో వచ్చి ఏమేమో చెబుతారని, కళ్ళబొల్లి మాటలు నమ్మి ఆగం కావద్దని సూచించారు. కుల వృత్తులతో పాటు అన్ని రకాల చేతివృత్తుల ప్రజలు బాగుపడాలంటే మళ్ళీ ఒకసారి కారు గుర్తుపై ఓటేసి, సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని, మీ ప్రాంత బిడ్డగా, అభివృద్ధి చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో రజకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు లక్ష్మీ నరసింహా రావుకే ఉంటుందని మండల రజక సంఘం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపిపి సుమలత-శ్రీనివాస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, గ్రామ సర్పంచ్ ఆరే లత-మహేందర్, మహిళ నాయకురాలు నేరేళ్ల జ్యోతి, లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!