ఆళ్లపల్లి మండల అధ్యక్షులు ఇస్లావత్ నరేష్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ లో ఇల్లందు మండలంలో పని చేస్తున్న లావుడియా రాందాస్ నాయక్ ఆళ్లపల్లి మండలానికి చెందిన ఎంపీపీఎస్ బోడైకుంఠ పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ ఏం గా పదోన్నతి పై వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్ టీటీఎఫ్ ఆళ్లపల్లి మండల అధ్యక్షులు ఇస్లావత్ నరేష్, రాందాస్ నాయక్ కు ఘన స్వాగతం పలికారు. మండల అధ్యక్షులు ఇస్లావత్ నరేష్ మాట్లాడుతూ ఆళ్లపల్లి మండలానికి మీ సేవలు చాలా అవసరమని, కాబట్టి మిమ్మల్ని పదోన్నతి రూపంలో మా మండలానికి అధికారులు పంపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మర్కోడ్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బాబూలాల్, ఎస్సిఆర్పి కవిందర్, పాతూరు హెడ్మాస్టర్ అశోక్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.