
శ్రీరాంపూర్ జిఎం సూర్యనారాయ
జైపూర్,నేటి ధాత్రి:
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు టేకుమట్ల, ఇందారం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి మినీ స్టేడియం,ఓపెన్ జిమ్ లను గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు జనవరి 6వ తేదీన సింగరేణి శ్రీరాంపూర్ జి.ఎం సూర్యనారాయణ ని జైపూర్ కాంగ్రెస్ నాయకులు కలవడం జరిగింది.స్పందించినటువంటి జిఎం గురువారం రోజున వచ్చి మిని స్టేడియం,ఓపెన్ జిమ్ ల స్థల పరిశీలన చేశారు.అలాగే టేకుమట్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం జిఎం కి స్థానికులు వివరించి విన్నవించారు.ఈ సందర్భంగా సింగరేణి జిఎం మాట్లాడుతూ సింగరేణి తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని,మినీ స్టేడియం,ఒపెన్ జిమ్ పనులను వెంటనే ప్రారంభిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐకె ఓసి పిఓ వెంకటేశ్వర రెడ్డి,సివిల్ డిపార్ట్మెంట్ ఆనంద్ కుమార్,ఎస్టేట్ మేనేజర్ వరలక్ష్మి,ఐకె ఓసి ఎస్ఓ సతీష్ మరియు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.