ప్రజలు పెద్ద బాధ్యత
అప్పగించారు.
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చర్ల కోల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పై ఓటమిపాలైన విషయం తెలిసిందే ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు సహజమేనని బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నిజాయితీగా పనిచేసిన ప్రతి ఒక్కరికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కొరకు తన ఎమ్మెల్యే పదవిని కూడా గడ్డిపోచలా విసిరి కొట్టిన ఘనత తనదేనని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు అధైర్య పడొద్దు మనం ఓడిపోయినమని ఎప్పుడు అనుకోవద్దు అంటు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడతానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అతి పెద్ద బాధ్యత అప్పగించినారని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ వాగ్దానాలు చేయకపోతే అడుగడుగునా ప్రశ్నించే అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రజలు మనకు మేలు చేశారని ఒక ప్రకటనలో తెలియజేశారు.