కె సీతాలక్ష్మి ఐఎయస్,యస్సి,ఎస్ టి గురుకులాల కార్యదర్శి
హైదరాబాద్, నేటిధాత్రి:
ఈరోజు హైదరాబాద్ లోని మాసబ్ టాంక్,డిఎస్ఎస్ భవన్ లో ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం రాష్ట్ర కమిటీతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గురుకులాల కార్యదర్శి శ్రీమతి కె సీతాలక్ష్మి ఐఎయస్ ఈవిధంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ప్రతిభ (సిఓఇ) గురుకుల పాఠశాలలను యదావిధిగా కొనసాగిస్తాం,అలాగే కొన్ని కొత్తగా సిఓఇ లను పెంచుతాం,గతంలో నడిపిన కార్యక్రమాలను ఎ ఒక్కటి తగ్గించను అవసరమనుకుంటే కొత్త కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం,ఈ సంవత్సరం నుండి సిఓఇ గురుకులాల్లో 8వ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు, విద్యార్థులకు జేఈ, నీట్,ఐఐటి లలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి మంచి పలితాలు వచ్చేవిధంగా కృషిచేస్తామని,అలాగే విద్యార్థులకు మంచి ఆరోగ్యం కోసం పనేసియా హెల్త్ కమాండింగ్ సెంటర్ యదావిధిగా కొనసాగిస్తాం,103 గురుకులాలకు నూతన పక్క భవనాలు నిర్మిస్తాం,విదేశీ విద్యకు కృషిచేస్తానని సీతాలక్ష్మి గురుకులాల కార్యదర్శి ఐఎఎస్ మాట్లాడినారు,కార్యదర్శి కి ఈసందర్భంగా ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారు,
ఈ సమావేశంలో సక్రునాయక్ డిఎస్,అనంతలక్ష్మి,శర్మ,అనుపమ,రామ్ లక్ష్మణ్ ఉన్నారు, అలాగే
ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం రాష్ట్ర నాయకులు చాతల్ల సదానందం,మచ్చ నర్సయ్య,పత్రి లలిత రాణి, బానోత్ రాంబాబు నాయక్, స్వరూప సింగ్,జ్యోతి,సుంకసారి వెంకటేష్,రామాంజనేయులు,శంకర్,మొట్ల మౌనిక, గోషిక కుమార్,తదితర నాయకులు పాల్గొన్నరు.