జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని పెంచికలపేట అమరవీరుల స్థూపం వద్ద సిపియుఎస్ఐ పార్టీ 26వ వారోత్సవాలను భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ అధ్యక్షతన. ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ దైద వెంకన్న హాజరై మాట్లాడుతూ
కామ్రేడ్ మారోజు వీరన్న ఈ దేశంలో కమ్మ్యూనిస్ట్ పార్టీ ఎందుకు విప్లవం విజయవంతం కావడం లేదు అని గ్రహించి చుండూరు, కారంచేడు, వెంపేటలో దళితులపై జరిగిన దాడులకు చలించిపోయిన కామ్రేడ్ వీరన్న కమ్మ్యూనిస్ట్ పార్టీ వర్గ పోరాటంతో పాటు కుల పోరాటం చేయకపోవడమే ఈ దేశంలో కమ్మ్యూనిస్ట్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. మారోజు వీరన్న నేత్రత్వంలో కుల వర్గ పోరాటాల ద్వారానే ఈ దేశంలో విప్లవం విజయవంతం అవుతుందని ఫూలే, అంబేద్కర్, ఆలోచనను మార్క్స్యజం జోడించి ఈ దేశంలో అణగారిన కులాలకు రాజ్యాధికారంతో పాటు విప్లవం విజయవంతం కావాలని 1998 డిసెంబర్ 25 తారీఖున డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మనుధర్మ శాస్రాన్ని దగ్ధం చేసిన రోజున సిపియుఎస్ఐ పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) పార్టీని ఆవిర్బవించడం జరిగింది. ఉద్యమంలో పనిచేసి 150 మంది అమరులైనారు మా వాడాలో మా రాజ్యం సబ్బండా కులాలకు రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిస్తూ ఈనెల 25 నుండి 31 వరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో
కామ్రేడ్ దారకొండ శంకర్
దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్
జాడిగట్టన్న కార్మిక సంఘం కన్వీనర్
బుర్రి కుమారస్వామి
రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు