రైతు బందు ఇస్తున్న బి ఆర్ ఎస్ కావాలా,రైతు బందు వద్దు అంటున్న కాంగ్రెస్ కావల

*అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయండి

*స్థానికుడు, సౌమ్యుడు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని

* రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ కోరారు

బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కపూర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడిన వినోద్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోయినిపల్లి మండలం మల్కపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ప్రచారం నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్ లో వినోద్ కుమార్ మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వినోద్ కుమార్ వివరించారు.
రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం, దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని వినోద్ కుమార్ అన్నారు.అనంతరం ఏం ఎల్ ఏ మండలం లోని తడగొండ దుండ్రపల్లి కోరెం బూరుగుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఏం ఎల్ ఏ సుంకే రవి శంకర్ కు జోష్ తో డ్యాన్స్ లు చేస్తూ వీర తిలకం దిద్ది స్వాగతం పలికారు.పలు గ్రామాల్లో ఓటర్ల వద్దకు వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్, బీజేపీ లు తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణలక్ష్మీ ఎందుకు లేదను ప్రశ్నించారు.24గంటల కరెంట్ దండగ అని కాంగ్రెస్ వస్తె మూడుగంటలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారని అన్నారు.కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పతకం అమలు చేయడం లేదని తెలిపారు.కాంగ్రెస్ బిజెపి మాటలు నమ్మి మోపోవద్దని తెలిపారు.తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది.అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది.మేనిఫెస్టో, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని కోరారు.
తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం..ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం,ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5వేలకు,దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానిస్తుంది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని రూ.16వేలకు పెంచడం జరుగుతుందనీ అన్నారు.
వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇవ్వడం లేదని విమర్శిస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుందనీ అన్నారు.

స్థానిక బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలని కోరారు.

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని సుంకె రవిశంకర్ అన్నారు.గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనీ
ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదనీ తెలిపారు పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు.
అందరికీ అందుబాటులో ఉంటున్న.ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు. ఆయన వెంట బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావు, జెడ్పిటిసి కత్తెరపాక ఉమ కొండయ్య ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు,బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ అమిత్ కుమార్, కోరెం సింగల్ విండో చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి,రైతు బందు సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బి ఆర్ ఎస్ సీనియర్ భీమనాథుని రమేష్, నల్లగొండ అనిల్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *