బ్లీచింగ్ పౌడర్ జల్లుతున్న గ్రామపంచాయతీ సిబ్బంది
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గ్రామ కారోబార్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందిచేత సానిటేషన్ పనుల కార్యక్రమన్ని వీధి వీధి తిరుగుతూ కాలువలలో మరియు నీరు నిల్వ ఉన్నచోట ప్రజలు దోమలబారినుండి రక్షణ పొండటానికి ఇల్లు ఇల్లు తిరుగుతూ బ్లీచింగ్ పౌడర్ ను జల్లడం జరిగింది.ఈ సందర్భంగా కారోబార్ ఆనందరావు మాట్లాడుతూ వార్డులోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా ఇంటింటికి చెత్త సేకరణ,డ్రైనే జీలు ఎప్పటికప్పుడు తీపించడం, వీధులలో చెత్త ఉండకుండా శుభ్రపరచ డము,నల్లాల ద్వారా ప్రతి ఇంటికి నీళు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది డ్రైవర్ నాగరాజు,సాంబయ్య,మొగిలి తదితరులు పాల్గొన్నారు.