
కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్
పరకాల నేటిధాత్రి
ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీ, దుబాసి వాడ,ఒంటేరు గడ్డలలో సానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ సంపత్ కుమార్ చేపడుతున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం ప్రారంభమై వాతావరణ మార్పులతో ప్రజలు రకరకాల వ్యాధులు,సీజనల్ వ్యాధులు, మలేరియా,టైఫాయిడ్,డేంగి, చికెన్ గున్యా,వైరల్ జ్వరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరినారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో పరిశుభ్రంగా లేని ప్రాంతాలలో దోమలు వ్యాప్తి చెందుతాయని దోమల వలననే వ్యాధులన్నీ వస్తాయని అన్నారు.పారిశుద్ధ్యం చక్కగా జరిగేలా చూడాలని ఇంటింటికి చెత్త సేకరణ చేయాలని,పాగింగ్ చేయించాలని,బ్లీచింగ్ చల్లించాలని,డ్రైనేజీల వెంట, రోడ్ల వెంట పిచ్చి మొక్కలు తీపించాలని,చైర్ పర్సన్ ని, కమిషనర్ ని కోరినారు.