ప్రపంచ కార్మికుల హక్కుల కోసం పోరాడాలి
సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో హమాలీ కార్మిక సంగం, భవన నిర్మాణ కార్మిక సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఏఐసీసీటీయు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్బంగా మాట్లాడుతు 1886 లో అమెరికా పట్టణంలోని చికాగో నగరంలో 16 గంటల పని చేపిస్తున్న కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా 8 గంటల పని దినాలు కావాలని శాంతి యుతంగా నిరసన చేస్తున్న కార్మికులపై బాంబులు వేస్తూ, తుపాకీ తూటలకు బలి అయిన కార్మికులు జైల్లో ఉరి శిక్షకు గురి అయిన కార్మికులకు జోహార్లు తెలియజేస్తున్నాం. కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాడి హక్కులు సాదించుకోవాలని పిలుపు నిచ్చారు. 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని సంగటిత, అసంగటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈ ఎస్ ఐ ప్రమాద బీమా వర్తించాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల జెండాను బోండ్ల సతీష్ ఎగురావేసినారు. హమాలీ కార్మికుల జెండాను మచ్చ రాజయ్య ఎగురవేసినారు.సిపిఐ ఎంల్ జెండా ను అంబాల అశ్వథామ ఎగురవేసినారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు మాట్ల శ్రీనివాస్, గునిగంటి రజని మహేందర్, నేరెళ్ల రామకృష్ణ,కార్మికసంగం ఏఐసీసీటీయు జిల్లా కార్యదర్శి
కన్నూరి డానియేలు, భవననిర్మాణ కార్మికుల సంగం నాయకులు రాం రాంచందర్, నిమ్మల స్వామి సుస్మిత స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు..
