పెద్దకుంటపల్లి లో హనుమాన్ విగ్రహ ప్రతిష్టన

పెద్దకుంటపల్లి లో హనుమాన్ విగ్రహ ప్రతిష్టన

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని పూజలు చేశారు.అంతకు ముందు హనుమాన్ దేవాలయం నిర్వాహకులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను,భక్తి భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. దేవాలయాలు సమాజానికి శాంతి కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు.అలాగే గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామంలోని దేవాలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version