
జాతీయ నాయకుడు వస్తే జనాలు లేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది
అభిమానం ప్రేమ అంటే మీలా నీరాజనాలు పలుకుతరు
ప్రజల కోసం పనిచేస్తున్నానని ఆనాడు మీ నుంచి దూరం చేసిండ్లు
నోట్ల కోసం కండువాలు మార్చుకునేటోళ్లు ప్రజలకు జవాబు చెప్పాలే
అర్హులైన ప్రతి పేదకుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాదే
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
ఎన్నికలు వచ్చాయంటే ఓట్ల కోసం కాంగ్రెస్సోళ్లు నోట్లు పంచిండ్లే కానీ ఏనాడు మన గురించి ఆలోచన చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో రెండు రోజుల ముందు ఊర్లలకు వచ్చి డబ్బులతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. అధికారం, పదవులు, కుర్చీలు మాత్రమే వాళ్లకు అవసరమని ప్రజల కష్టాలు కన్నీళ్లు అవసరం లేదన్నారు. అనేక ఏండ్లుగా ఈ ప్రా