₹1.70 Crore Development Works Launched in Hanumakonda
ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…
#అన్నీ డివిజన్ లలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి..
#శంకుస్థాపన చేసిన ప్రతి పని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నాం..
#ప్రజల భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి…
#నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న..
#కాజీపేట,హనుమకొండ లలో పలు డివిజన్ లలో సుమారు రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ, నేటిధాత్రి:
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.పేర్కొన్నారు.సోమవారం రోజున శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజవర్గ పరిధిలోని 47 వ డివిజ బోడగుట్ట,31 వ డివిజన్ శాయంపేట ఎస్సీ కాలనీ,8 వ డివిజన్ గుడి బండల్ లలో సుమారు రూ.1.70 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా డివిజన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీలో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.గతంలో పలు కాలనీల్లో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చాలా కాలనీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి జరుగుతున్నదని,రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు.
బోడగుట్ట గ్రామానికి ప్రధాన రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయాలని స్థానిక ప్రజలు కోరగా సంబధిత అధికారులకు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని సూచించారు.
శాయంపేట దళిత కాలనీలో చాలా వరకు నూతన రోడ్లు వేశామని మిగిలిన అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు,అధికారులు ఉన్నారు.
