బిఆర్ఎస్ పార్టీలో రబ్బర్ స్టాంప్ లాగానే ఉన్నాం

చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి

పార్టీలో చేరిన నాయకులను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ వారికి సరైన గుర్తిపు లేదు…

కాంగ్రెస్ సీనియర్ నాయకులు…

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 08, నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం తో అవిశ్వాసం వీగిపోయి క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. అందులో భాగంగానే గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు నేతృత్వంలో చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు కొక్కుల స్రవంతి-సతీష్ ,మేకల తిరుమల, పుల్లూరు సుధాకర్, పొలం సత్యం, పనాస రాజయ్య లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ జంగం కళ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్లు మాట్లాడుతూ…. మాజి ఎమ్మెల్యే బాల్క సుమన్ తమకు కౌన్సిలర్ టికెట్లు ఇచ్చి గెలుపుకు సహకరించినప్పటికి తమను రబ్బర్ స్టాంప్ లాగానే చూశారు కానీ ఏ ఒక్క రోజు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించలేదని, సహకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్క సుమన్ స్వయంగా తానే మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని కోరడంతో అవాక్కయ్యమని,అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారని అడిగితే ఎదురు మాట్లాడుతున్నారని తమని అవహేళన చేశారని వాపోయారు. ప్రస్తుత చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని,మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు.పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.అనంతరం పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి నాయకులు పి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అబ్దుల్ అజీజ్ ,వొడ్నాల శ్రీనివాస్ లు మాట్లాడుతూ… బిఆర్ఎస్ నాయకులు పదవులు కోల్పోయి మతిస్థిమితం లేని వాళ్ళ లా మాట్లాడుతున్నారని అన్నారు. స్ధానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నియోజకవర్గ,మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.తాజా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మతి కోల్పోయి మాట్లాడుతున్నారని,ఓటమిని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.మంచిర్యాల జిల్లాలో, నియోజక వర్గంలో ఎలా తిరుగుతాడో చూస్తామని అన్నారు.నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. ప్రజలతో మమేకమై కష్టపడి పని చేయాలని రానున్న రోజుల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సింగరేణిలో సుమారు 600 కారుణ్య నియామక పత్రాలను అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.టపాసులతో సంబరాలు జరుపుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికి సరైన గుర్తంపు లేదు…

రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అలకబూనారు.నిన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు గా కొనసాగి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ పెత్తనం చెలాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేసిన మాకు ఎలాంటి పదవులు లేకున్నా సరే ముందుకు సాగుతున్నమని అంటున్నారు.ఇప్పుడు కొత్తగా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్న వారికి ప్రియార్టి ఇస్తున్నారని పార్టీకోసం కష్టపడ్డ నాయకులు ,కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

నిన్నటి వరకు దూషించిన వారే మళ్లీ పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోభోం…

కాంగ్రెస్ యూత్ నాయకులు కుమ్మరి రవి….

కార్యక్రమంలో పార్టీ యూత్ నాయకుడు ఇందిరానగర్ కు చెందిన కుమ్మరి రవి తమకు సరైన గుర్తింపు లేదు అంటూ,నాయకులు సైతం ప్రియారిటి ఇవ్వడం లేదని,నిన్నటి వరకు మమ్మల్ని దూషించి, బెదిరించిన కౌన్సిలర్లే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లో చేరి మళ్ళీ మాపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ ,జై కాంగ్రెస్ అంటూ కాసేపు తన ఆవేదనను వెళ్ళబుచ్చాడు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్, పలిగిరి కనకరాజు, సంగ బుచ్చయ్య,ఆకుల రాజన్న, సుధాకర్,గూడ సత్తయ్య, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!