Friends Extend Financial Support to Satish’s Family
మేమంతా ఉన్నాం మా స్నేహానికి అండగా
నడికూడ,నేటిధాత్రి:
స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు.తోటి మిత్రుడికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చుక్క సతీష్ తండ్రి సల్మాన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని 1996-1997 సెవెంత్ పౌండేషన్ బ్యాచ్ మిత్రులు తమవంతు సాయంగా అతనికి రూ.10 వేలు అందజేశారు.భవిష్యత్ లోనూ తోటి స్నేహితుల ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.సతీష్ స్నేహితులను మండల పరిధిలోని గ్రామాల ప్రజలు కౌకొండ గ్రామస్తులు అభినందించారు.సహాయం అందజేసిన వారిలో ముక్కెర రాజు,ముక్కెర చిరంజీవి, ఎండి సాధిక్ పాషా,మేకల సతీష్,పేర్వాల బాలకృష్ణ, మేకల రాజేందర్,బొల్లె ఓంకార్,పసుల నర్సింగం, ఎండి గిడ్డు,జన్నారపు వేణు, మేకల కుమారస్వామి,మేకల ఓంకార్,జన్నారపు చంద్రమౌళి,సుమలత, శారద,జ్యోతి,తదితరులు ఉన్నారు.
