వృద్ధుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కాసం ఫౌండేషన్ సభ్యుడు కాసం ధీక్షిత్ అన్నారు, కాసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నగరంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు, మనల్ని కనీ పెంచిన తల్లి దండ్రులను వృద్ధాశ్రమలలో వదిలి వేయకుండా వారిని ఆప్యాయంగా చూసుకుంటూ పెమనూరాగాలు పంచితే వారు వృద్ధాప్యం నుండి యవ్వనం వైపు తిరిగి వస్తారని కాసం ధీక్షిత్ పేర్కొన్నారు. చలి కాలం వస్తున్నందున వృద్ధులకు దుప్పట్లు పంచుతూ వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటూ ఆప్యాయంగా పలకరించారు. సేవా కార్యక్రమాల్లో కాసం ఫౌండేషన్ ముందు ఉంటుందని అన్నారు.