హైడ్రా, మూసీనది చుట్టూ తెలంగాణ రాజకీయాలు

ప్రచారహోరులో మరుగున పడుతున్న వాస్తవాలు

మూసీ ప్రక్షాళన ఆలోచనలు నేటివి కావు

2005లోనే కాలుష్య నివారణ చర్యలు

2006లో మూసీ పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభం

2022లోనే రూ.8973 కోట్లతో నదీ ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూసీనది ప్రక్షాళనకోసం అక్రమ కట్టడాల కూల్చివేతలు మరి యు జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకోసం ఏర్పాటైన హైడ్రా సంస్థ అక్రమ కట్టడాల పై ఉక్కుపాదం మోపుతుండటం మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడమే కాదు, సర్వత్రా ప్రధాన చర్చనీయాం శంగా మారడం వర్తమాన చరిత్ర. హైడ్రా పరిధి రాజధాని చుట్టూ ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లోపల ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ మాత్రమే. ఇక మూసీ పరీవాహక ప్రాంతంలో చేపడుతున్న కూల్చివేతలకు హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది లావుండగా దుర్గం చెరువుతో సహా పదకొండు చెరువులను పునరుద్ధరించి పరిరక్షించాలని హైకోర్టులో 2007లో ఒక పిల్‌ దాఖలైన నేపథ్యంలో దీనిపై కోర్టు ఒక అడ్వకేట్‌ కమిషన్‌ను నియ మించింది. ఈ చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికార్లు ఆయా చెరువుల పరిధిలో నివసిస్తున్న వేలాదిమందికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఈ 11 చెరువుల అంశం కోర్టు పరిధిలో వుంది.
ఆందోళనలు అనవసరం
తాము ఎంతో కష్టపడి నెలసరి వాయిదాలపై లోన్లు తీసుకొని నిర్మించిన ఇళ్లపైకి ఎప్పుడు బు ల్డోజర్‌ వస్తుందోనని నగరవాసులు ముఖ్యంగా మధ్య, పేదతరగతి వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు చెరువులు, కుంటల్లో పట్టా భూములు వుంటే అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని చట్టాలు స్పష్టంగా చెబుతుంటే, రెవెన్యూ, మునిసిపల్‌ అధికార్లు ఎడాపెడా అనుమతులిచ్చారని, వారిపై చర్యలు తీసుకోకుండా కష్టపడి నిర్మించుకున్న తమ ఇళ్లపైకి బుల్డోజర్లు పంపడం ఎంతవరకు న్యాయమనేది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆవేదన. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సరైన అవగాహనతో కూడిన ప్రచా రం లేకపోవడం ప్రజల్లో భయాందోళనలకు ప్రధాన కారణమన్నది మరువరాదు. అక్రమ నిర్మాణమైనప్పటికీ అందులో ప్రజలు నివసిస్తుంటే దాని జోలికి వెళ్ల బోమని హైడ్రా కమిషనర్‌ స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో అన్ని అనుమతులు వున్న కమర్షియల్‌ నిర్మాణాలను కూడా కూ ల్చబోమని కూడా ఆయన చెబుతున్నారు. నీటివనరులను పరిరక్షించే చర్యల్లో భాగంగా కొత్తగా నిర్మించే అక్రమ నిర్మాణాలు లేదా అనుమతులు రద్దు చేసిన వాటిని మాత్రమే కూల్చివేస్తామని ఆయన కుండబద్దలు కొడుతున్నట్టు చెబుతున్నా, ఇవి సరిగ్గా ప్రజల్లోకి వెళ్లడంలేదు. కూల్చివేతల హోరులో ప్రజల్లో అనవసర భయాలు సృష్టించే ప్రచారాలు ఎక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు ఎఫ్‌టిఎ మరియు బఫర్‌ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై కేసులు న మోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ చెబుతున్న మాటలు కూడా సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్లడంలేదు. అక్రమంగా అనుమతులిచ్చిన అధికార్లపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామంటున్నా అవి ‘బుల్డోజర్ల’ భయం హోరులో ఎవరి చెవికి ఎక్కడంలేదు. ప్రసార సాధనాల జోరు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అసలు వాస్తవాలు మరుగునపడి, అవాస్తవ ప్రచారాలు చిలవలు పలవలుగా ప్రజలకు చేరడం ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణం. పెద్దవాళ్లకు నోటీసు లు జారీచేస్తూ, పేదలకు నోటీసులు జారీచేయకుండానే ఇళ్లను కూలగొడుతున్నారని జరుగుతు న్న ప్రచారంలో కూడా పూర్తి వాస్తవం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జలవనరుల్లో నిర్మించిన నిర్మాణాల కూల్చివేతకు ఎటువంటి నోటీసులు జారీచేయాల్సిన అవసరం లేద న్న సత్యాన్ని హైడ్రా కమిషనర్‌ గుర్తుచేస్తున్నారు. ఈ రూలు అందరికీ సమానమే. ఈ గందరగోళంలో ఎవరూ పట్టించుకోని మరో ప్రధానాంశం, హైడ్రా పేదలు నివసించే ఇళ్లజోలికి పోవడంలేదన్న సత్యాన్ని గుర్తించకపోవడం. ఇటీవల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు, హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నించిన నేపథ్యంలో జులై 19న జీఓ ఎంఎస్‌ నెం.99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీజేసిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆమోదముద్ర వేయ డం తాజా పరిణామం. వచ్చే శాసనసభ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ఎంతమాత్రం వెనుకడుగు వేయడానికి సిద్ధంగా లేరన్న సత్యం వెల్లడవుతోంది.
విపక్ష రాజకీయం
విపక్షాలు ప్రభుత్వంపై దాడిచేయడానికి ఎప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాయి. ఇప్పుడు వాటికి ఈ కూల్చివేతల రూపంలో దొరికిన ఈ చక్కటి అవకాశాన్ని ఎడాపెడా తమకు అనుకూలంగా మలచుకోవడానికి యత్నించడం తమ రాజకీయ క్రీడలో వాటికి సహజమనిపించవచ్చు. కాంగ్రెస్‌కు ఓటేయలేదన్న అక్కసుతోనే మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్లు కూల గొడుతున్నారని అవి ప్రచారానికి దిగడం ప్రజల్లో మరింత గందరగోళాన్ని సృష్టించడానికి తప్ప మరోటి కాదు. అసలు మూసీ నదికి హద్దులు నిర్ణయించి, నదికి 50 కిలోమీటర్ల దూరంలో బఫర్‌ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది గత బి.ఆర్‌.ఎస్‌.ప్రభుత్వం మాత్రమే. 2021లో తీసుకున్న నిర్ణయం ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ను తయారుచేయాలని అప్పటి రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్ల కు ఆదేశాలిచ్చింది కూడా కె.సి.ఆర్‌. ప్రభుత్వమే. మరిప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకంటూ ఎ దురుదాడికి దిగుతున్నది కూడా బీఆర్‌ఎస్‌ మాత్రమే. మూసీని కాలుష్య రహితం చేయాలని, ఈ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించింది కూడా కె.సి.ఆర్‌. అన్న సత్యా న్ని బి.ఆర్‌.ఎస్‌. నాయకులు మరచిపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ లబ్దికోసం చేస్తున్న ఆర్భాటం మాత్రమేననుకోవాలి. నిజానికి 2023లోనే నాటి బి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం మూసీ నదిని, గోదావరి జలాల ద్వారా పరిశుభ్రం చేయాలని తలపోసింది. ఇందుకోసం మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకు అయ్యే ఖర్చు దాదాపు రూ.9వేల కోట్లుగా అంచనా చేసింది. మురికినీటిని శుభ్రం చేసే ప్లాంట్లు, వంతెనలు, చెక్‌డ్యాంల నిర్మాణం, జంటనగరాలకు 85 కి లోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాలను మూసీనదిలోకి తరలించడం ఈ ప్రాజెక్టులో భాగం. అయితే మూసీ నది పరిరక్షణ చర్యల్లో భాగంగా బి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం చేపట్టాలనుకున్న చర్యలను కొందరు నిపుణులు అప్పట్లో విభేదించారు ‘ఇక్కడ కావలసింది మూసీనది ప్రాంత సుందరీకరణ కాదు, మురికిమయంగా మారిని నదీ జలాలను స్వచ్ఛంగా మార్చడం’ అని స్పష్టం చేశారు. కాలుష్య మయంగా ఉన్న మూసీ జలాల పరిశుభ్రంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని కూడా వారు ప్రభుత్వానికి సూచించారు. సుందరీకరణ వల్ల నదీ తీరం మరింత కుంచించుకుపోతుంది. ఒకపక్క నదిలోని నీరు దుర్గంధం వెదజల్లుతుంటే సుందరీకరణకు అర్థం లేదంటూ వారు వ్యక్తం చేసిన అభిప్రాయంలో వాస్తవం వుంది. దీనికితోడు మరింత తగ్గిపోయిన నదీ తీరం వల్ల నగరానికి వరద ముప్పు మరింత పెరుగుతుంది.
ఆక్రమణల రాజకీయాలు
కృష్ణానదికి ఉపనదిగా ఉన్న మూసీ తెలంగాణలోని అనంతగిరి కొండల్లో పుట్టి నల్గండ జిల్లా లో కృష్ణానదిలో కలుస్తుంది. గత 30ఏళ్లుగా వేగంగా జరిగిన పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి ప్రభావాన్ని మూసీనది చవిచూసింది. ఫలితంగా ప్రస్తుతం ఇది ప్రమాదకరమైన రసాయనాలు, మురుగు నీరు విచ్చలవిడిగా కలుస్తున్న నేపథ్యంలో దుర్గంధాన్ని వెదజల్లుతూ రోగాలకు కారణమవుతోంది. ఆవిధంగా ఒకనాడు తెలంగాణ థేమ్స్‌ నదిగా పేరొందిన మూసి చివరకు ఇంతటి దుర్గతికి లోనైంది. ఇప్పటివరకు మూసీనది ప్రక్షాళన కోసం కోట్లాది నిధులు ఖర్చుచేసామని చెబుతున్నా ఒక్క చుక్క నీరు కూడా పరిశుభ్రం కాలేదు. ఈ నేపథ్యంలో కె.టి.ఆర్‌. గతంలోని మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని పక్కనబెట్టి కొత్త ప్రణాళిక చేపట్టాలని నిర్ణయించారు. అయితే గోదావరి జలాలలను మూసీనదికి తరలించడం వల్ల కొత్త సమస్యలు వరదల రూపంలో తలెత్తుతాయని పర్యావరణవేత్తలు మొత్తుకున్నారు. ముఖ్యంగా మూసీనది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది కాబట్టి గోదావరి జలాలను ఇందులోకి తరలిస్తే, నగరానికి వరదముప్పు ఏర్పడుతుందని కూడా హెచ్చ రించారు. అంతేకాదు ప్రాజెక్టు డాక్యుమెంట్‌ను బయటపెట్టి, బహిరంగ చర్చలకు అవకాశం క ల్పించాలని కూడా అప్పట్లో నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలావుండగా నది తీరప్రాంతం రియల్టర్లు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల ఆక్రమణలకు లోనుకావడంతో దీని పరిధి బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో ఆక్రమణలకు పాల్పడ్డవారు, తమ భూముల చుట్టూ నిరుపేదలు గుడిసెలు వేసుకోవడానికి ప్రోత్సహించారు. ఆవిధంగా వారు తమ అక్రమ నిర్మాణాలను రక్షించుకోవాలన్న దుస్సంకల్పం వారిది. వీరి నిర్మాణాలను కూల్చాలంటే, ముందుగా అధికార్లు నిరుపేదల గుడిసెలను కూల్చాలి. అప్పుడు నానా యాగీ చేయవచ్చు. ఇప్పుడు జ రుగుతున్నది సరిగ్గా ఇదే. ఈ కుచ్చిత రాజకీయాలకు రేవంత్‌ రెడ్డి లంగ బోడన్న సత్యాన్ని తా జా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
రేవంత్‌ను బుజ్జగించిన అధిష్టానం
మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్‌ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాల కూల్చివేతలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ను కోరినట్టు తెలుస్తోంది. అక్రమ కట్టడాల విషయంలో నిందితులు ఒకరైతే, బాధితులు నిమ్నకులాలవారే ఉంటారన్న సంగతిని ఆయనకు గుర్తు చేసినట్టు సమాచారం. అయితే డబుల్‌ బెడ్‌రూమ్‌లు, పునరావాస కార్యక్రమా ల ద్వారా నిరాశ్రయులను ఆదుకుంటామని రేవంత్‌ భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఏ బుల్డోజర్‌ సంస్కృతికి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతుందో, అదే సంస్కృతిని అమలు చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని కూడా హితవు చెప్పడమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా సామాన్యులపై కొరడా రaుళిపించవద్దని కూడా ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. విచిత్రమేమంటే ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల్లో బుల్డో జర్‌ ప్రయోగం వల్లనే అక్రమార్కులు, గూండాల అరాచకాలు తగ్గాయన్న సత్యాన్ని కాంగ్రెస్‌ ఇంకా గుర్తించకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి అరాచకాలు అరికట్టడం వల్ల ప్రగతిపథంలో దూసుకుపోతున్న సత్యాన్ని విస్మరించకూడదు. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఈ వైఖరిని అక్కడి ప్రజలు తిరస్కరించారు కనుకనే కనుమరుగైపోయింది. అయినా దీన్ని ఆ పార్టీ అధినాయకత్వం గుర్తించకపోవడం విషాదం!
చరిత్ర
1908లో మూసీనదికి వచ్చిన వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో నదికి వరదలను నివారించే ప్రక్రియలో భాగంగా ఉస్మాన్‌ సాగర్‌, హిమయత్‌ సాగర్‌ రిజర్వాయర్లను అప్పటి నిజాం ప్రభుత్వం నిర్మించింది. 1997లో మూసీ బచావో ఆందోళన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం మూసీనది ప్రాంతాన్ని సుందరీకరించే ప్రక్రియలో భాగంగా ‘నందనవనం’ ప్రాజెక్టు ను అమలు చేసింది. 2005లో మొట్టమొదటిసారి ప్రభుత్వం నదిలోకి కాలుష్యాలు చేరకుండా ఒక ప్రాజెక్టును చేపట్టింది. 2006లో మూసీ పరిరక్షణ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా 2009లో మూసీనది పునరుజ్జీవనం కోసం రబ్బర్‌ డ్యామ్‌లను నిర్మించింది. 2010లో మూసీ మాస్టర్‌ ప్లాన్‌ను అప్పటి ప్రభుత్వం రూపొందించింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2016లో నదికి భారీ వరదలు వచ్చాయి. 2017 మార్చి 25న లో తెలంగాణ ప్రభుత్వం ‘మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డిసిఎల్‌)’ను ఏర్పాటు చేసింది. 2020లో నదికి మళ్లీ వరదలు వచ్చాయి. 2022లో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు నదీ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించి ఇందుకోసం రూ.8,973 కోట్లు కేటాయించారు. 2023 సెప్టెంబర్‌లో ఆయన, మూసీ నదిని గోదావరి జలాలతో పరిశు భ్రం చేస్తామని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. తర్వాత ఎన్నికల్లో బి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం ఓటమి పాలై ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌ రెడ్డి మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడుగా వ్యవహరించడం అక్రమార్కులకు మింగుడు పడటంలేదు. ఇందుకోసమే ఈ రభస. ఈ సమస్యను అడ్డం పెట్టుకొని బి.ఆర్‌.ఎస్‌. రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తుంటే, అక్రమ ఆ క్రమణలకు పాల్పడినవారు ఏదోవిధంగా తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండటం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ప్రధాన కారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *