కెనాల్ గేట్లు తెరవండి…లేదంటే మేమే తెరుస్తాం….
ఈ నెల 6న నిరాహార దీక్షకు సిద్దం…
హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి…
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో గల పంట పొలాలకు తక్షణం నీరందించాలని హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపుతొ వ్యవహరిస్తుందని,పొలాలకు,పంటలకు నీరందించక పోవడంతో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మండలములోని ఉప్పల్ గ్రామములో బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ బిఆర్ఎస్ అభ్యర్థి,మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం,అధికారులు హుజురాబాద్ రైతాంగం పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని,పంటలు ఎండిపోతున్నా,చోద్యం చూస్తూ కూర్చున్నారని దుయ్యబట్టారు.వెంటనే కెనాల్ గేట్లు ఎత్తి నీరు అందించాలని,లేని పక్షంలో తామే కెనాల్ గేట్లు తెరిచి రైతులకు నీరు అందిస్తామని హెచ్చరించారు.రెండు రోజుల్లో పంటలకు నీరు అందని పక్షములో ఈ నెల 6న నియోజక వర్గం లో బారి ఎత్తున నిరాహార దీక్ష చేపడుతామని మరో సారి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించాడు.త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు వినోద్ కుమార్ కు బారి మెజారిటీ అందిస్తారని,గ్రామాల్లో కాంగ్రెస్స్ నాయకులను రైతులు,ప్రజలు తిరగనీయరని,వెంటనే నీరందించి పంటలను కాపాడాలని కోరారు.