కౌన్సిలర్ పొన్నగంటి విజయ మల్లయ్య
జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు ప్రజల అభివృద్ధి నా లక్ష్యం అని కౌన్సిలర్ పొనగంటి విజయ మల్లయ్యఅన్నారు.జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు కౌన్సిలర్ పొనగంటి విజయ మల్లయ్య జన్మదినం సందర్భంగా బుధవారం స్థానిక శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పదవ వార్డులో వృద్ధులకు బట్టల పంపిణీ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయ మాట్లాడుతూ తన చేతుల మీదుగా వార్డు మహిళల ఆశీర్వాదంతో తన భర్త పొనగంటి మల్లయ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న కౌన్సిలర్ విజయ మల్లయ్య మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని మా కష్టసుఖాలు పంచుకునే బాగా కల్పించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని వృద్ధులు తెలిపారు .ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.