వరంగల్, నేటిధాత్రి
నేటిధాత్రి పత్రిక 2024వ సంవత్సరం క్యాలెండర్ ను, తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ అసోసియేటెడ్ అధ్యక్షులు, వరంగల్ మండల తహశీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఇక్బాల్ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి అని, ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ రాస్తున్న పత్రిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మహేందర్, సీనియర్ జర్నలిస్టులు నీలం శివ, అజయ్, బొమ్మగాని సతీష్, రాజేంద్రప్రసాద్, నేటిధాత్రి వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ కందికొండ గంగరాజు, ఎంజీఎం రిపోర్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.