మలిదశ ఉద్యమకారుడు బత్తుల కుమార్ కు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని, తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ కు వినతిపత్రం అందచేసిన తూర్పు బిఆర్ఎస్ కార్యకర్తలు
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, వరంగల్ ఎంపీ గా, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమనాయకుడు వరంగల్ తూర్పు 32వ డివిజన్ కు చెందిన, బడుగు బలహీన వర్గాల దళిత నాయకుడు బత్తుల కుమార్ ను, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రకటించాలని, 32వ డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ ఏకతాటిగా ఉండి, వారి అభ్యర్థనను తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ కు వినతిపత్రం సమర్పించారు. 2001 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉంటూ రాష్ట్ర సాధన కొరకు తనవంతు సహాయ సహకారాలు, ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ, పలు కేసులలో జైలుకు సైతం వెళ్లి, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో కూడా ఉద్యమ సమయంలో, జైలులో ఒకే బ్యారక్ లో ఉన్నటువంటి ఉద్యమకారుడు బత్తుల కుమార్ అని, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరపున అవకాశం ఇవ్వాలని, తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ ద్వారా, రాష్ట్ర అధిష్టానానికి తెలపాలని కోరుకుంటూ 32వ డివిజన్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, మహిళ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ రవి, డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, మాజీ కూడా డైరెక్టర్ మోడం ప్రవీణ్, మండా శ్యామ్, శివ మూర్తి, ఉద్యమకారుడు పరదేశి రాజేష్, కొండ రాజు, ఆడెపు బిక్షపతి, జగన్, మహిళా అధ్యక్షులు కేదారి పద్మ, సువర్ణ, కళావతి, నాగమణి, కవిత డివిజన్ ఉపాధ్యక్షుడు శోభన్ బాబు, బత్తిని సతీష్, కొండ సూరి, ఎండి దస్తగిరి, మాటేటి శ్యామ్, నీలం శివ, నూక రమేష్, మోడీ, నరసింహ, తాళ్లపల్లి శివ, సమీర్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.