
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
నేటిధాత్రి, వరంగల్
గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహగానాలకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్న వరంగల్ మేయర్ గుండు సుధారాణి హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారాలని అనుకున్నారు. కానీ, వరంగల్ నుండి తీవ్ర స్థాయిలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకొలేదు. నిరంతరం కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపిన్నట్లు సమాచారం. తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు కొందరు నేతలు బహిరంగగాన్నే విమర్శిస్తున్నారు. వరంగల్ మేయర్ మాత్రం ఈ రోజు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకుని పార్టీలోకి వలసలు వచ్చే వారిని చేర్చుకున్నట్లు తెలుస్తోంది.