పాదయాత్రలో పాల్గొన్న వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల
పరకాల,నేటిధాత్రి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ కాంగ్రేస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డ డివిజన్ లోని లక్ష్మీ కాంప్లెక్స్ నుండి ఆనంద్ నగర్,బంజారా నగర్,ప్రేమ నగర్,ఓల్డ్ సుల్తాన్ నగర్,జామియా మస్జిద్,నూర్ మస్జిద్,న్యూ సుల్తాన్ నగర్,నేతాజీ నగర్ మరియు రాజీవ్ నగర్ పార్క్ మీదుగా నిర్వహించిన పాదయాత్రలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,జూపల్లి కృష్ణా రావు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యేలు గణేష్,భూపతి రెడ్డి,మధుసూదన్ రెడ్డి,తుడి మేఘ రెడ్డి,రాజేష్ రెడ్డి,ఎమ్మెల్సీ దండె విటల్,టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం మరియు ఛైర్మన్ గుత్తా అమిత రెడ్డి,తాహిర్ బిన్ హాందన్ తదితరులు పాల్గొన్నారు.
