వ‌రంగ‌ల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పరిశీలనలో డాక్టర్ బి నిరంజన్

గత అసెంబ్లీ ఎలక్షన్లో ఉద్యమాల పురిటిగడ్డ బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచి పది అసెంబ్లీ సీట్లు కోల్పోయింది. బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అర్బన్ ప్రాంతమైన వరంగల్ లోక్ సభ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేయూలో పార్టీ ఏర్పడిన 2001నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యమ నేపథ్యం, మేధావి అయిన టిఆర్ఎస్వి వ్యవస్థాపకు ఉపాధ్యక్షులు డాక్టర్ బైరి నిరంజన్ను వరంగల్ ఎంపీగా బరిలోకి దింపడానికి బిఆర్ఎస్ అధిష్టానం ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అలాగే పార్టీలో పాత క్యాడర్ను పార్టీలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ప్రస్తుతం మన పార్టీ నూతన జీవసత్వాలు నింపడానికి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు పార్టీకి దూరమైన తరుణంలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తు విస్తృతమైన సంబంధాలు ఉండి కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ఆ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మరోవైపు నమస్తే తెలంగాణకు అనేక వ్యాసాలు రాస్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న డాక్టర్ నిరంజన్ ను వరంగల్ పార్లమెంటులో బరిలోకి నిలపడం వల్ల విజయం పార్టీకి సులువుతుందని ఆ వర్గాలను కూడా మెప్పించినట్టు అవుతుందని అధిష్టానం భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నిక‌లు, వాటి ఫలితాల‌ వేడి ఇంకా త‌గ్గ‌కముందే.. పార్ల‌మెంటు ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న వేళ‌.. ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ శ‌క్తుల‌న్నింటినీ కూడ‌దీసుకొంటున్నాయి. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు అన్ని పార్టీలూ పావులు క‌దుపుతున్నాయి. ఆ నేపథ్యంలోనే బిఆర్ఎస్ కు బలమైన కావాలన్న ఉద్దేశంతో డాక్టర్ నిరంజన్ పేరు తెరపైకి వచ్చింది.

వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స్థానానికి వ‌చ్చే స‌రికి స‌రికొత్త ప‌రిస్థితి క‌నిపిస్తున్న‌ది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓట‌మి పాలైన ప‌రిస్థితుల్లో ఆ పార్టీ త‌ర‌పున బ‌రిలో దిగేందుకు స‌హ‌జంగా రాజ‌కీయ ఉద్దండులే జంకుతారు. ఇలాంటి స్థితిలో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌రిలోకి దిగేందుకు కాక‌తీయ యూనివ‌ర్సిటీలో అధ్యాప‌క వృత్తి నిర్వ‌హిస్తు న్న బైరి నిరంజ‌న్ ముందుకు రావ‌టం రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌స్తున్న‌ది. అసెంబ్లీ ఎన్నిక ల్లో బీఆర్ ఎస్ ఓట‌మి పాలై నెల రోజులే అవుతున్నా, ఏటికి ఎదురీద‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్న బైరి నిరంజ‌న్ మ‌నోస్థైర్యానికి ఉద్య‌మ‌కారులు ముగ్దుల‌వుతు న్నారు. నైతిక‌త అంటే ఇది క‌దా అని చెప్పుకుంటున్నారు. ఉద్య‌మ నేప‌థ్య‌మే నైతిక బ‌లంగా, పెట్టుబ‌డిగా రంగంలోకి దిగేందుకు స‌మాయ‌త్త‌మైన బైరి నిరంజ‌న్ ఇప్పుడు అంద‌రి చూపును ఆక‌ర్శిస్తున్నారు.

మలిదశ ఉద్యమంలో వర్సిటీ విద్యార్థి నాయకుడైన నిరంజన్ పై దాడే మొదటిది

బైరి నిరంజ‌న్ వృత్తి, ప్ర‌వృత్తి తెలంగాణ ఉద్య‌మ‌మే. ఆయ‌న విద్యార్థిగా ఉన్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధ‌నే శ్వాస‌గా జీవించారు. తెలంగాణ ఉద్య‌మాన్ని బ‌లోపేతం చేయ‌టం కోసం అహ‌ర్నిశ‌లు పాటుప‌డ్డారు. ఆ క్ర‌మంలో ఆయ‌న అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నారు. పోలీస్ నిర్బంధాలు,వేధింపులు
భౌతిక దాడులకు గుర‌య్యారు. బ‌హుశా తెలంగాణ ఉద్య‌మంలో తెలంగాణ వ్య‌తిరేకుల భౌతిక దాడికి గురైన మొద‌టి వాడు బైరినిరంజ‌న్.

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందు రోజుల్లో కేజీ సత్యమూర్తితో క‌లిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బైరు నిరంజ న్ టిఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీ విద్యార్థి విభాగం వ్యవస్థాపక సభ్యులలో ఒక‌రుగా ఉన్నారు. ఉద్య‌మ విస్త‌ర‌ణ‌కు, బ‌లోపేతానికి కృషి చేస్తూ టిఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో విశేష కృషి చేశారు. అలాగే కేయూ వేదికగా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి విద్యార్థులను సంఘ‌టితం చేయ‌టం, చైత‌న్యం చేయ‌డంలో ప్రముఖంగా పని చేశారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేస్తున్నారన్న అక్క‌సుతో కాకతీయ విశ్వవిద్యాల యంలోని ఏబీవీపీ మ‌తోన్మాద శ‌క్తులు 2002 లో నిరంజన్‌, సైదిరెడ్డి మీద దాడి చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిపై ఈ విధంగా దాడి జరగడం ఇదే మొదటిది. 2002 హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్ లో నాయిని నర్సింహారెడ్డి మేయర్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఉస్మానియా పరిసర ప్రాంతాల్లో కాలనీ ఉన్న ప్రాంతాలలో దాదాపు 500 మంది కేయూ విద్యార్థులను తరలించి హైదరాబాదులో ఉద్యమం రగిలించడానికి మున్సిపల్ ఎలక్షన్ వాడుకొని ప్రచారం నిర్వహించారు. అలాగే టిఆర్ఎస్ పోటీచేసిన ప్రతి ఎలక్షన్లలో తన శక్తి వంచన లేకుండా కృషి చేశారు

ఉద్యమం కోసం…. ఉద్యోగానికి రాజీనామా

2003లో అప్పటి వెలుగు, ఇప్పటి ఐకెపి ప్రభుత్వ సంస్థలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా ప‌ని చేస్తున్న కాలంలో, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ విద్యార్థి ఉద్యమంలో ప‌నిచేయ‌టం ఇబ్బంది అని, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్య‌మంలో దూకారు. ఆ క్ర‌మంలోనే యూనివర్సిటీలలో విద్యార్థులను సమీకరించి ఉద్యమంలో భాగస్వాముల య్యారు. అలాగే కేయూ జేఏసీలో కోఆర్డినేటర్ గా ఉండి టీవీ 9, ఎన్టీవీ, రాజ్ న్యూస్, హెచ్ఎంటీవీ లాంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగే చర్చా వేదికల్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తన మేధో, విశ్లేష‌ణా శ‌క్తితో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. అంతే కాకుండా తన కలంతో అనేక పత్రికలలో వ్యాసాలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తు రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. 2001 సిద్దిపేట్ కేసీఆర్ ఉప ఎన్నిక నుంచి మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా ప్రతి ఏ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తన శక్తి వంచన లేకుండా కృషిచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ల డం కోసం నమస్తే తెలంగాణ, ఇంకా ఇతర పత్రికలకు ఎడిటోరియల్ పేజీల్లో వ్యాసాలు రాశారు. ఈ మధ్యకాలంలో సినిమాలో సహా కథా రచయిత గా కూడా త‌న సృజ‌నాత్మ‌క శ‌క్తిని స‌మాజానికి పంచుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ‌లో ఉన్న ప‌రిస్థితుల్లో ఇలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, యూనివర్సిటీ ఉద్యమకారుడుకి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల గెలుపు సులువు అవుతుందని తెలంగాణ వాదులు మేధావులు అంటున్నారు. హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్యార్థి, మేధావులు, జర్నలిస్టులు, డ్వాక్రా మహిళలు వారు గెలుపు కోసం పని చేస్తారని పాత తరం టిఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ ఆశిస్తున్న‌ బిఆర్ఎస్వి రాష్ట్ర వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు, విద్యార్థి విభాగం వరంగల్ ఇంచార్జ్, యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ అధ్యాపక నాయకుడు యువ మేధావి డాక్టర్ బైరి నిరంజన్ కు వ‌రంగ‌ల్ స్థానం నుంచి ఎంపీ టికెట్ ఇస్తే గెలుపు సులువు అవుతుంద‌ని ప‌లువురు అనుకొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే టిఆర్ఎస్ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్థానిక శాసనసభ్యులు – చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను బైరి నిరంజ‌న్ క‌లిసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఏది ఏమైనా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బైరి నిరంజ‌న్ లాంటి యువమేధావి ఎన్నిక‌ల రంగంలోకి దిగటం వ‌రంగ‌ల్ ఓట‌ర్ల‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు అంటే.. మంద‌ బ‌లం, ధ‌న బ‌లంగా మారిపోయిన ప‌రిస్థితుల్లో నైతిక‌తే పెట్టుబ‌డిగా, ఉద్య‌మ నేప‌త్య‌మే త‌ర‌గ‌ని శ‌క్తిగా బ‌రిలోకి దిగుతున్న బైరి నిరంజ‌న్ రాజ‌కీయ ఆరంగేట్రం యువ ఓట‌ర్ల‌ను, తెలంగాణ వాదుల‌ను ఉత్తేజితుల‌ను చేస్తున్న‌ది. ఉద్య‌మ శ‌క్తిని చూపేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!