హన్మకొండ:నేటిధాత్రి
ములుగు జిల్లా చల్వాయి గ్రామానికి చెందిన నాగరాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాగరాజుకు భార్య మౌనికతో పాటు రాము లక్ష్మణ్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. జనవరి 17న లక్ష్మణ్ (3) సంవత్సరాలు ఆడుకుంటూ కింద పడిపోవడంతో తలకు గాయమై ఫిట్స్ రావడం ప్రారంభమైంది. వెంటనే తల్లిదండ్రులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా సిటి స్కాన్ చేసిన వైద్యులు తలకు గాయం కావడం వల్ల రక్తం కారి గడ్డ కట్టింది వెంటనే బాబు కు ఆపరేషన్ చేయాలని లేకపోతే బాబు ప్రాణానికి ప్రమాదమని తెలపడంతో నిరుపేద కుటుంబానికి చెందిన నాగరాజు బంధువులు, దాతల సహాయ సహకారాలతో ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం లక్ష్మణ్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉండగా హాస్పిటల్ ఖర్చులు రోజుకు 55 వేల నుండి 65 వేల వరకు అవుతున్నాయి. అంత ఖర్చు భరించే ఆర్థిక స్తోమత తమకు లేదని దాతలు ఎవరైనా పెద్ద మనసుతో ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే తమ బిడ్డను బతికించిన వారవుతారని తల్లిదండ్రులు మౌనిక నాగరాజు దంపతులు వేడుకొంటున్నారు. సహకారం అందించాలనుకునే దాతలు 8008994920,9963174160 నెంబర్లకు ఫోన్ పే, గూగుల్ పే చేసి ఆదుకోవాలని కోరారు.