విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు
జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామస్తులు విఆర్వోను నిర్భంధించారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలో విఫలమయ్యాడని నిరసిస్తూ గ్రామ విఆర్వో ఆదినారాయణను గ్రామపంచాయతీ భవనంలో గ్రామస్తులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ గ్రామస్తులతో మాట్లాడి అందరికీ పట్టా పాస్‌పుస్తకాలు ఇస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి విఆర్వోను వదిలిపెట్టారు.