క్యాతనపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గా వోడ్నాల శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ ను క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు గా నియమిస్తూ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడారు. నాపై నమ్మకంతో పట్టణ అధ్యక్ష బాధ్యత అప్పగించిన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని అన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని అన్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, జూనియర్ నేతలందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తానని, పార్టీ శ్రేణులంతా సహకరించాలని కోరారు.
