
12 గ్రామాల యువకుల బ్రతుకుతెరువు పోయింది
మిడ్ మానేరు ప్రాజెక్టుపై నేటి దాత్రి స్పెషల్ ఫోకస్
వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ అర్బన్ మండలం లోని మిడ్ మానేరు ప్రాజెక్టు ఇది రిజర్వాయర్ లో పూర్తిగా నీటిమట్టం తగ్గడంతో ఇలా బయటపడ్డ ముంపు గ్రామాలు
చక్కని ఉర్లు పచ్చని చేలుకలు ఊరు నిండా జనం చుట్టూ బంధువులు ఏడేళ్ల క్రితం వరకు ఆ పన్నెండు ఊర్ల పరిస్థితి కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఆ ప్రాజెక్ట్ ఆ ఊర్లు అన్నింటిని మింగేసింది ముంపుతో గ్రామం మోడు భారీ పోయింది ఐదేళ్లుగా ముంపు లోనే ఉన్న గ్రామాలు ఇప్పుడు నీరు లేక పూర్తిగా బయటపడ్డ గ్రామాలు ఆ ఊర్లను చూస్తూ గ్రామస్తుల గుండెలు పగిలిపోతున్నాయి నామరూపాలు లేకుండా పోయిన తమ ఊర్ల దృశ్యాలు మనసుల్ని మెలిపెడుతున్నాయి విడ్మనేర్ నిర్వాసితులపై నేటి ధాత్రి ప్రత్యేక కథనం
ఏడేండ్ల క్రితం ఖాళీ చేసిన గ్రామాలని మిడ్ మానేరు ప్రాజెక్టు లో నీరు లేక పోవడంతో మరోసారి చూసుకుందామని వచ్చిన గ్రామస్తులకు శిథిలమైన ఇండ్లు దర్శనమిచ్చాయి ఇండ్లలో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ వీధుల్లో చిన్నప్పుడు ఆడుకుంటూ మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు ఎంత గొప్పగా ఉన్న ఊరు ఇలా అయిపోయింది అన్న బాధ వారి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది మా ఊరు ఏది మా ఇల్లు ఏది అని వెతుక్కుంటూ వచ్చిన వారి గుండెల్ని పిండేస్తుంది మిడ్ మానేరు ప్రాజెక్టుల కోసం మొత్తం 12 గ్రామాల ప్రజలు త్యాగం చేశారు ఉన్న ఊరును చేసుకునే వ్యవసాయాన్ని వదిలేసి వెళ్లిపోయారు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతుల బాగోగుల కోసం వారు కదిలిపోయారు 2006లో మొదలైన ప్రాజెక్ట్ 2017లో పూర్తయింది ఆ సంవత్సరంలో బలవంతంగా నైనా ఖాళీ చేయక తప్పలేదు దీంతో కొదురుపాక శభాష్ పల్లి నీలోజుపల్లి చీర్లవంచ అనుపురం కొడుముంజా చింతల్ టానా రుద్రవరం సంక పెళ్లి గ్రామ ప్రజలు వలస వెళ్లిపోయారు ఆయా గ్రామాల వారు బరువెక్కిన హృదయాలతో అశ్రునయనాలతో తమ ఊర్లు వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రాజెక్టు ప్రారంభం అవడం భారీగా వచ్చిన వరదలకు మానేరులో వచ్చి చేరిన నీటితో ముంపుకు గురి అయ్యాయి ఇప్పుడు నీరు లేక బయటపడ్డ గ్రామాలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టిస్తున్నాయి
మోడు వారిన ఆ ఊర్లని చూస్తే ఎవరికైనా కంటతడి రాకమానదు నిర్వాసిత గ్రామ ప్రజలకు ఉపాధి లేదని కన్నీరు మున్నేరు అవుతున్నారు ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం సరిగ్గా అందలేదని అంటున్నారు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఉన్నామని ఇప్పటి కి అందాల్సిన పైసలు రాలేదని అంటున్నారు ఒకప్పటి మానేరు మా బ్రతుకులు మార్చింది ఇప్పుడు మా నీరు మా కంట్లో కన్నీరు కారుస్తుందని నిర్వాసిత గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు