
బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతూల నిషిధర్ రెడ్డి అన్నారు
బుధవారం జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల గెలిపించాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అత్యధికమైన ప్రజలు విశ్వసిస్తున్నారని మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమైన అని వారు అన్నారు రేపు భారతీయ జనతా పార్టీ తలపెట్టిన విజయోత్సవ సంకల్ప యాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని ఈ యాత్రలో ముఖ్యఅతిథిగా కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కేంద్ర నాయకులు పాల్గొంటారని వెయ్యి బైకులతో భూపాలపల్లి నుండి రేగొండ వరకు బైక్ యాత్ర నిర్వహిస్తామని అన్నారు దేశంలోని ప్రజలు భాజపా పరిపాలన లో అత్యధిక వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాల వీధి వ్యాపారులకు కిసాన్ సమ్మన్ యోజన పల్లె ప్రకృతి వనాలు స్మశాన వాటికలు వీధి దీపాలు అనేక కార్యక్రమాలు మోడీ ప్రభుత్వ విధానాల వల్ల అమలు జరిగాయని విజయోత్సవ సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతులను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్తామని రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని బూతు స్థాయి నుండి క్లస్టర్లుగా ఏర్పడి పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు అసెంబ్లీ ప్రచార కార్యదర్శి ప్రబారి వెంకటరమణ
పాపన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాత్ర ప్రముఖు
కణం యుగదీశ్వర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి
ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులు దొంగల రాజేందర్
జిల్లా ప్రచార కార్యదర్శి మందాల రఘునాథరెడ్డి
ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి మాచినవేని రవీందర్
నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి తదితర భాజపా నాయకులు పాల్గొన్నారు