జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
విజ్ఞానాన్ని తొలగించే విగ్నేశ్వరుని చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మంగళవారం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద నిర్వాహకులకు 5 వేల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందని. ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపు ప్రజలందరి పై ఉండి.. పాడి-పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు కురువాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వినాయక నిమజ్జన వేడుకలను అందరు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామాల్లోని వినాయక మండపాల నిర్వాహకులు డప్పు చప్పులతో శాలువాలతో ఘణస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోల్నేని సత్యనారాయణరావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ఎంపిటిసిలు ఎక్కటి సంజీవరెడ్డి, తెడ్ల ఓదలు, దాంసాని విజయ-కుమార్, సర్పంచ్లు మొగిళి, మట్ట రజిత, బిఆర్ఎస్ నాయకులు సుకుమార్, ఆశోక్ రాజయ్య, మర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.