చిత్రపురిపై విజిలెన్స్‌ కమిషన్‌ దృష్టి!

https://epaper.netidhatri.com/view/290/netidhathri-e-paper-11th-june-2024%09/3

`‘‘నేటిధాత్రి’’ వరుస కథనాలకు స్పందన.

`చిత్రపురి అవకవకలపై తవ్వకాలకు రెడీ!

`రెండు మూడు రోజుల్లో ఎంట్రీ!

`రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కదలిక.

`చిత్రపురి అక్రమాలు వెలికితీత.

`గత ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరా!

`చిత్రపురి గద్దలపై నిఘా!

`దోపిడీ దారుల గుట్టు రట్టే.

`విజిలెన్స్‌ కి దొరికితే వారి బతుకు అంతే.

`జీవితాలు శంకరగిరి మాణ్యాలే.

`కార్మికుల పొట్టగొట్టిన వారిని వదిలిపెట్టరంతే.

`అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారికి అదోగతే.

`అప్పనంగా ఫ్లాట్లు కొట్టేసిన వారికి కటకటాలే.

`వేల కోట్ల కుంభకోణ సూత్రదారులకు ఇక చుక్కలే.

`‘‘ఎర్ర రుమాల్‌’’ కింద బొరియలు వెలికితీతే.

`కార్మికపక్షపాతి ముసుగు ‘‘తమ్మ’’కు దబిడిదిబిడే!

`మాటలు రాసి గోతులు తీసిన వారికి శ్రీ’’కృష్ణ’’ జన్మస్థానమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పాపం పండాలంటే సమయం రావాలి. తప్పుల మీద తప్పులు చేసే వారి గుట్టు బైటకు రావాలి. అంటే కొంత కాలం ఆగాలి. ఇదీ పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు సరిగ్గా చిత్రపురి విషయంలో ఆ సమయం వచ్చింది. చిత్రపురిలో తాము ఆడిరది ఆట. పాడిరది పాట. దోచుకున్నంత దోపిడికి తెగబడిన వారి గుట్టు రట్టు చేసే సమయం ఆసన్నమైంది. కార్మికులకు న్యాయం చేస్తామని, అన్యాయం చేసిన వారి తాట తీస్తామని ఎన్నికల ముందు హమీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మికులకు హమీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్రపురిపై దృష్టిపెట్టారు. దాదాపు ముప్పై ఏళ్లుగా జరిగిన అవినీతి అక్రమాలపై ఎంక్వౌరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు విజిలెన్స్‌ ఎంక్వౌరీ ప్రకటించనున్నారు. నేడో రోపో ఆ ప్రకటన రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంత కాలంగా నేటిధాత్రి వరుస కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. అసలు చిత్ర పురి కథ నుంచి మొదలు రో హౌజ్‌లు, ఇప్పుడు కొత్తగా ట్విన్‌ టవర్ల పేరుతో మళ్లీ మొదలు పెట్టిన దోపిడీపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ బృందం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో పలు సార్లు చర్చలు జరిపారు. చిత్రపురిపై సమాచారం తెప్పించుకున్నారు. వివిధ కార్మిక సంఘాల నుంచి నివేదికలు కూడా తీసుకున్నారు. వారు ఇచ్చిన పిర్యాధులను పరిశీలించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయం పొందుపర్చడం జరిగింది. అందుకే చకచకా సీనీ కార్మికుల సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపురి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్న పట్టుదలతో వున్నారు. గత ప్రభుత్వ పాలకులు కొంత మంది సీనీ పెద్దలకు సహకరిస్తూ, భూ ఆక్రమణదారులకు సాయపడుతూ, అసలైన కార్మికులను అన్యాయం చేశారని ప్రభుత్వానికి పిర్యాధులున్నాయి. దాంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. గతంలో చిత్రపురి విషయంలో అనేక మీడియా కధనాలు వచ్చాయి. అయినా వాటిని గత పాలకులు పట్టించుకోలేదు. పైగా అందులో స్ధలాల మీద, ఫ్లాట్ల మీద కూడా అప్పటి పాలక పెద్దలు కన్నేశారన్నది తెలుస్తోంది. గత పదేళ్ల కాలంలో చిత్ర పురిలో ఇష్టారాజ్యంగా కొంత మంది సినీ పెద్దలు ఆటవిక రాజ్యం చేశారని తెలుస్తోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు తెలుస్తోంది.

చిత్ర పురిలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నవారంతా నిత్యం సత్యభోదన చేసేవారే.
అందులో ఓ సినీ కార్మికుల పక్షపాతి అన్నట్లు నిత్యం తనను తాను కీర్తించుకునే ఓ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా వున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదైవుంది. ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. ఒక దశలో ఆయన చెప్పిందే వేదమన్నట్లు జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన లీలలు బైటకు వస్తున్నాయి. ఓ ఇరవై ఏళ్ల క్రితం చిన్నా, చితక సినిమాలు నిర్మాణం చేసి, కొన్నింటికి దర్శకత్వం వహించారు తమ్మారెడ్డి బరద్వాజ. ఎప్పుడైతే చిత్ర పురి భూములు పేద సినీ కార్మికుల కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయింపులు చేసిందో అప్పటి నుంచి ఆయన సినిమాలు తీసింది లేదు.పరోక్షంగా తీసిన ఒకటో రెండో సినిమాలు కూడా చిత్రపురికి చెందిన సొమ్ముతో తీశారని, సొసైటీ సొమ్మును అప్పనంగా వాడుకున్నాడని అంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు చిత్రపురి సొసైటీ సొమ్ము ఏటిఎంగా అక్కరకొచ్చిందని బాధితులు చెబుతుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు చేసేది లేదు. నటుడు కాదు. కాని ముప్పై ఏళ్లుగా సినీ పెద్దగా చెలామణి అవుతున్నాడు. ఇటీవల చిత్రపురికి చెందిన విషయాలపై నేటిధాత్రిలో వరుస కథనాలు రావడం, చిత్ర రంగంలో విసృతమైన చర్చ జరగడంతో ఆయనకు ఆదాయం ఆగిపోయింది. వెండితెరను నేనే ఉద్దరిస్తున్నాన్ననంతగా చెప్పుకునే ఆ భరద్వాజ ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా చిన్న చిన్న కార్యక్రమలు, ఇంటర్వూలు చేసుకుంటూ జీవన భృతి వెత్తుక్కుంటున్నారు. ఇంత కాలం ఆయన చిత్రపురిలో సమకూరిన ఆదాయాన్ని సుష్టుగా భోంచేశారని, ఎప్పుడు డబ్బులు అసవసరం వస్తే అప్పుడు చిత్రపురి ప్లాట్లను అమ్ముకోవడం అలవాటు చేసుకున్నాడని కూడా బాదితులు చెబుతుంటారు. చిత్రపురిలో వున్న స్కూలు విషయంలో ఇటీవల ఓ చిత్రపురి కమిటీ సభ్యుడు ఫోన్‌ చేస్తే అతన్నే బెదిరించే ప్రయత్నం చేశాడు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కూల్‌ వల్ల సొసైటిలో కార్మికులను మరింత దోపిడీ కోసమే తప్ప మరొకటి కాదని సొసైటీ సభ్యుడు ఎంతచెబుతున్నా వినకుండా అతన్ని బెదించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న స్కూలుకు చిత్రపురి సొసైటీకీ ఎలాంటి సంబంధం లేకుండా, సొసైటీ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా స్కూల్‌ సొసైటీ ఏర్పాటు చేసుకొని వచ్చిన సొమ్ము తింటున్నారని సదరు వ్యక్తి చెప్పినా వినిపించుకోకుండా అతన్ని బెదిరించాడు. చిత్రపురిలో వున్న స్కూల్‌ ఆదాయం కూడా చిత్ర పురి సొసైటీ డెవలప్‌ మెంటుకోసం వినియోగిస్తారంటూ అడ్దదిడ్డమైన సమాదానాలు చెప్పాడు. ఇలా దోచుకోవడానికి వీలైనన్ని దారులు వెత్తుక్కోవడం తప్ప, కార్మికులకు మేలు చేసిందేమీ లేదన్నది దాంతో తేటతెల్లమైంది.

చిత్రపురిలో జరిగిన అవినీతి అక్రమాలపై పోలీసులు పిర్యాధులు స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
ఆ కమిటీ చైర్మన్‌ అనిల్‌ వల్లభనేనిని అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇంకా ఇరవైమంది పేర్లున్నాయి. కాని వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. వారి జాడ తెలియడం లేదన్నట్లు పోలీసులు కూడా వదిలేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వున్న మరో ప్రముఖులలో పరుచూరి సోదరుడు ఒకరు. ఆయన నిత్యం సమస్యలు. కార్మికులు. సమసమాజం.ఎర్ర జెండా వంటి నీతి సూత్రాలు వల్లిస్తుంటాడు. ఆ సోదరులు కొన్ని వందల సినిమాలకు కథలు సమకూర్చారు. మాటలు రాశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహంచారు. ఒక దశలో వారు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సమాజం చైతన్యం కోసమే అన్నటు వున్నాయి. కాని వారు మాత్రం సమాజాన్ని పీల్చుకునే పనులు చేశారు. చిత్ర పురి కార్మికుల జీవితాలను ఆగం చేశారు. ఇవి సాక్ష్యాత్తు కార్మికులు అంటున్నమాటలు. చిత్రపురి సాధన సమితి అనే సంస్ధ పరుచూరి సోదరుల బాగోతాలు బైట పెట్టింది. ఈ ఇద్దరు సోదరులకు మరో హౌజింగ్‌ సొసైటీలో ఇండ్లున్నాయి. ఒక సొసైటీలో ఇండ్లు తీసుకున్నవారు , మరో సొసైటీలో ఇండ్లు తీసుకోవడం చట్ట విరుద్దం. అయినా పరుచూరిసోదరులు చిత్రపురిలోనూ ప్లాట్లు తీసుకున్నారు. అందులో జరిగే అక్రమాలలో పాలు పంచుకున్నారు. పంపీణీలలో వాటాలు తీసుకున్నారన్న ఆరోపణలు అనేకం వున్నాయి. మొత్తంగా చిత్ర పురి సొసైటీలో జరిగిన అక్రమాలు రెండువేల కోట్లకు పైగానే వుంటుందంటే సినీ పెద్దలు ఎలా దోచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. పెరు పెరుమాలుది, ఆరగింపు అయ్యవారిది అన్నట్లు..కార్మికుల పేరు చెప్పి ఇలా దోచుకున్నవారు సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. పెద్దలు దోచుకున్న ప్లాట్లను తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటే కనీసం ఓ రెండు వేల ఫ్లాట్లు ఖాళీ అవుతాయని, కార్మికులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఇక గత ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వాళ్లు, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి, తోపాటు సినీ రంగంతో సంబంధం లేని కొంత మంది జర్నలిస్టులు కూడా ప్లాట్లు సొంతం చేసుకున్నారు. అసలు చిత్రపురి భూములకు రాజకీయ పార్టీలకు సంబంధం ఏమిటి? మీడియా విభాగంలో వున్న వారికి ప్లాట్ల కేటాయింపులేమిటి? సినీ పెద్దలు దోపిడీకి ఎగబడి వాళ్లు ప్లాట్లు తీసుకోవడంతోపాటు, చిత్రపురి సొసైటీ వ్యాపారం చేయడం ఏమిటి? సినిమాకు సంబంధం లేనివాళ్లకు ప్లాట్లు విక్రయించడం ఏమిటి? నిజమైన కార్మికులు లక్షలకు లక్షలు చెల్లించినా వారికి ప్లాట్ల కేటాయింపులు ఎందుకు జరగలేదు? ఈ కుంభకోణం వెనుకు వున్న పెద్దలెవరో అందరకీ తెలుసు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన వాళ్లే కాదు, అంతకంటే తిమింగళాలు కూడా వున్నాయి. ముందు ఈ పరారీలో వున్న దొంగలను అరెస్టు చేస్తే మొత్తం సినీ బాగోతమంతా బైటకు వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *