విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం
సుబేదారి పీఎస్‌లో యాజమాన్యంపై విద్యార్థి ఫిర్యాదు
విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకులు గుండాల్లా వ్యవహరించిన తీరు, మానవత్వాన్ని చేపాల్సిన కాలేజి యాజమాన్యం అధిక ఫీజుల రూపంలో మానవమృగాలై విద్యార్థి జీవితాన్ని సర్వనాశనం చేసిన ఘటన, మృదువుగా విద్యార్థి తల్లిని కాలేజికి రప్పించి మూకుమ్మడిగా ఆ తల్లిపై బెదురింపులకు పాల్పడిన కాలేజి అధ్యాపక బృందం. అడ్మిషన్ సమయంలో ఒప్పందం చేసుకున్న ఫీజు కంటే ఎక్కువ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసిన వైనం. ఫీజు చెల్లించలేదన్న సాకుతో నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా విద్యార్థి పరీక్షా ఫీజును ఇంటర్మీడియట్ బోర్డులో చెల్లించకుండా భవిష్యత్‌ను బజారుపాల్జేసిన ఘోర తప్పిదం. మా అబ్బాయి పరీక్షా ఫీజును ఎందుకు కట్టలేదని ప్రశ్నించిన తల్లిదండ్రులపై విద్యా విలువలను మట్టిలో గలిపి విద్యార్తి పేరెంట్స్ పైనే కాలేజి యాజమాన్యం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ ఫిర్యాదు చేసిన తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నది.ఇంటర్మీడియట్ బోర్డు డి.ఐ.ఈ.వో ప్రధానకార్యాలయానికి కూతవేటు దూరంలో వున్న ఓ ప్రైవేటు జూనియర్ కాలేజి నిబంధనలకు విరుద్దంగా నడుపుతూ, ఓ విద్యార్థి జీవితాన్ని కాలేజి యాజమాన్యం సర్వనాశనం చేసి, విద్యార్థి తల్లిని కాలేజికి పిలిపించి పదిమందికి పైగా కాలేజి అధ్యపకులు చుట్టు ముట్టి రౌఢీల్లా వ్యవహరించిన తీరుపై నగర ప్రజలు,విద్యార్థులు,విద్యార్థిసంఘాలు,ప్రజాసంఘాలు,విద్యావేత్తలు,విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కాలేజి పై పెదవి విరుస్తున్నారు.