జైపూర్, నేటి ధాత్రి:
ఎన్నికల ఫలితాలు విడుదలైన తరుణంలో మంగళవారం రోజున పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది.పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 21 రౌండ్ లెక్కింపు జరగగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 19,385 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తంగా బిజెపి అభ్యర్థికి 59,765, బిఆర్ఎస్ అభ్యర్థి 21,614, కాంగ్రెస్ అభ్యర్థి 79,101 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 19,385 ఓట్ల మెజారిటీని సాధించారు.ఈ విజయాన్ని పురస్కరించుకొని జైపూర్ మండలంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ,రంగులు చల్లుకుంటూ, బాణాసంచా పేల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.