జోగంపల్లిలో పశువైద్య శిబిరం
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్.సునిల్ మరియు ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 105 తెల్లజాతి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి ఎండి అనిఫా మాట్లా డుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందు జాగ్రత్తగా రైతులు నివారణకు టీకాలు వేసుకొని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రమేష్ బాబు వి ఎల్ వో, రవి జె వివో సదానందం వి ఏమరియు గ్రామ రైతులు ఏదుల. గంగయ్య లక్కం రవీందర్ గోరంటల. ఓదెలు, శంకరయ్య ఈజీగిరి. రవి గోరంటల. సాంబ య్య పల్లెబోయిన రఘు కౌటం. ప్రభాకర్ మారబోయిన మల్ల య్య చెక్క కొమురయ్య నవయుగ సొసైటీ డైరెక్టర్ లక్కం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
