
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే గ్రామంలో భోగ లక్ష్మణ్ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించగా మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పుల అంజని ప్రసాద్ కళ్యాణదాతగా వ్యవహరించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు తరలిరాగా పండితుల వేద మంత్రోత్సవాల మధ్య శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా,కన్నుల పండువగా జరిగినది. ఈకళ్యాణానికి ముఖ్యఅతిథిగా చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, కోలా రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.