
*నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 10సీసీ కెమెరాలను, పోలీస్ అధికారులు, సీసీ కెమెరాల దాతలు, ప్రజాప్రదినిధులతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చిన జిల్లా ఎస్పీ కి ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, విద్యార్థులు
గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దాత గొడుకు రాజ్ కుమార్ ని అభినందించిన జిల్లా ఎస్పీ.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని,గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని,ఒక సీసీ కెమెరా 100 పోలీస్ లతో సమానం అని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ మధ్య కాలంలో జిల్లా పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారు జైలు శిక్ష లు అనుభవించడం జరిగిందన్నారు.ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అని ప్రతి ఒక్కరు తమ తమ ఇంటిలో భర్త, పిల్లలకు వాహనాలు నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని,మద్యం తాగి వాహనాలు నడపకుండా చూసుకోవలసిన బాధ్యత తమదే అన్నారు.
జిల్లా పోలీస్ శాఖ మాధకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా పని చేస్తుందని , మాధకద్రవ్యాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. డ్రగ్స్ తగున్న వారి వివరాలు అందిస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో మాధకద్రవ్యాల కు అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించడానికి డి- ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని మీ బంధువులు,మీ పిల్లలు మాధకద్రవ్యాలకు అలవాటు పడితే వారిని డి ఆడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ చేపించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
మహిళలలు మొగవారితో పోటీ పడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడలని,మహిళలకు సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ రావడం ఇబ్బందిగా ఉన్నప్పుడు జిలాల్లో ఉన్న సఖి సెంటర్, జిల్లా షీ టీమ్ ని సంప్రదిస్తే వారు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అన్నారు.మైనర్ బాలికపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వారిపై పొక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ మారుతి, ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.