
-జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ మాధవ్ గౌడ్..మాజీ సర్పంచ్ ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 4
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సూర్య రిపోర్టర్, బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ నేత్రుత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్, మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావులు కేక్ ను కట్ చేసి వేముల మహేందర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టుగా ప్రభుత్వానికి..ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ..ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే మహేందర్ గౌడ్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలని..మరింత ఉన్నతమైన స్థానంలో నిలవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నిమ్మల భద్రయ్య, జర్నలిస్టులు సంతోష్, హరీష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బండి రఘుపతి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేముల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.