అభివృద్ధికి..
పట్టం కడతా
ఒక్క అవకాశం ఇవ్వండి.
వెల్దుర్తి శ్రీకాంత్
నిజాంపేట: నేటి ధాత్రి
అభివృద్ధికి పట్టం కడతానని, అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి వెల్దుర్తి శ్రీకాంత్ అన్నారు. నిజాంపేట మండలనికి చెందిన వెల్దుర్తి శ్రీకాంత్ గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్తులు సహకారం అందిస్తే.. గ్రామ అభివృద్ధిని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా చేసి చూపిస్తానన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని తప్పకుండా పరిష్కరించుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి రింగ్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు
