
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామము లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లన్న స్వామి వారి దేవాలయంలో 14/07/2024, ఆదివారం రోజు నుండి ఉత్సవ కార్యక్రమాలు మొదలుకనున్నాయి. ఆదివారం రోజు ఉదయం స్వామి వారికి గంగా స్నానము, అలాగే సోమవారం రోజున అగ్ని గుండాలు, అనంతరం పెద్దపట్నం మరియు అన్నదానము (మహాప్రసాదం కార్యక్రమములు వైభవంగా నిర్వహించబడును. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ప్రత్యేక వేడుకలలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. వేలాల గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు కోరారు.