ఘనంగా ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాతీయ జెండా ఎగురవేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ,పాల్గొన్న నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.
నియోజకవర్గ ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం వచ్చి భారతీయులపై పెత్తనం చెలాయించారు.దేశ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజల మాన ప్రాణాలను బలి తీసుకోవడంతో ఎందరో వీరులు తమ ప్రాణలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించారన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది దేశ నాయకులు తమ ప్రాణాలను అర్పించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారన్నారు.గాంధీ,సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్,నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,అల్లూరి సీతారామరాజు వంటి వీరుల త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని దేశం కోసం సేవ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు , తంజిమ్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,
మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్ ,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు , అధ్యక్షులు , మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు ,ఉద్యమకారులు ,బి ఆర్ ఎస్వీ నాయకులు ,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…