
హసన్ పర్తి / నేటి ధాత్రి
హాసన్ పర్తి మండల కేంద్రం లోని ఇందిరా మహిళ శక్తి ద్వారా లబ్ధి పొంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ సహకారంతో కావేరి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్నేహ క్యాంటీన్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీన్య తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కే ఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రజా ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారికతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. వారి కోసం బడ్జెట్లో వినూత్న పథకాలను ప్రతిపాదించింది. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఇందుకోసం స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ లలో మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
ఈ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణ చేపడుతుంది. వచ్చే ఐదేళ్లలో వీటిని 25,000 సంస్థలకు విస్తరింప చేయడానికి కృషి చేస్తుందన్నారు.
అనంతరం మహిళ మణులు ఈ క్యాంటీన్ బాగా నడుపుకొని మరియు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే వారికి తెలియజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ వన మహోత్సవంలో భాగంగా చెట్లను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి, ఎపిడి, ఎంపీడీవో, ఎమ్మార్వో, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.