కార్పోరేటర్ గురు మూర్తి శివకుమార్
హసన్ పర్తి / నేటి ధాత్రి
హసన్ పర్తి 66 వ డివిజన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గురు మూర్తి శివకుమార్ వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్ నాగరాజు కు వినతి పత్రం అందించి హసన్పర్తి నగరంలో గల సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించాలని కోరారు.
హసన్పర్తి పోలీస్ స్టేషన్ నుండి ఎల్లాపూర్ వరకు రోడ్డు వెడల్పు (డివైడర్) సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.
గత సంవత్సరం పట్టణ ప్రగతిలో మంజూరైనటువంటి వైకుంఠధామం ఇప్పటివరకు కాంట్రాక్ట్ పనులు మొదలుపెట్టలేదు
గతంలో టెండర్ అయిన సి.సి రోడ్లు,సైడ్ డ్రైనేజీలు ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు వాటి ఏర్పాటు గురించి
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ నుండి ఎల్లాపూర్ వరకు రోడ్డు వెడల్పు లేక సెంట్రల్ లైటింగ్ లేక రోడ్డు ప్రమాదాల లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
కావున శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు హసన్‌పర్తి 66 వ డివిజన్ సమస్యలని దృష్టి లో ఉంచుకొని మా డివిజన్ ప్రజల సౌకర్యాలకై న్యాయం చేయాలని కోరారు.