వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో ఏకో పార్కులో డబ్బులు చెల్లించి టికెట్ ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుందని కో ఏకో పార్క్ నిర్వహణ వారు చెప్పారని మార్నింగ్ వాకింగ్ టీం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మార్నింగ్ వాకింగ్ చేసే వారికి ఉదయం5గంటల నుండి 8 గంటల వరకు ఎలాంటి డబ్బులు టికెట్ లేకుండా ఉచితంగా అవకాశం కల్పించారని . అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు . గురువారం నుండి ఎకో పార్క్ దగ్గర డబ్బులు చెల్లించి టికెట్ తీసుకునే వారికి మాత్రమే ఏకో పార్కులో కి కి అనుమతి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించి మార్నింగ్ వాకింగ్ చేసే వారికి ఎలాంటి టికెట్ డబ్బులు చెల్లించకుండా మార్నింగ్ వాకింగ్ చేసే వారికి ఎకో పార్క్ లోకి అనుమతి మార్నింగ్ వాకింగ్ సభ్యులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు