హాస్టల్ వార్డెన్ లు స్థానికంగా ఉండేలా జిల్లా అధికారులు చొరవ చూపాలి.
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ
చిట్యాల. నేటి ధాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్ వార్డెన్లు స్థానికంగా ఉండాలని , కొందరు వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు ,వర్షాకాలం సీజన్లో చెరువులు కుంటలు వాగులు నిండి ఉంటాయి కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు పిల్లలు ప్రతిరోజు బడికి వెళ్తున్నారా లేరా స్కూళ్లకు వార్డెన్లు వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని ఓదెలు అన్నారు అలాగే స్కూలు టీచర్స్ కూడా హాస్టల్ పిల్లలు స్కూల్కు వస్తున్నారా లేరా అనే విషయాన్ని వార్డెన్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు మొగులపల్లి మండలంలో గనుక చూస్తే ఎస్సీ హాస్టల్ ఒక బాలుడు టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సరిగా స్కూలుకు వెళ్లాక వాగుల పడి చనిపోయినాడు ఈ విషయాన్ని అందరూ వార్డెన్లు దృష్టిలో పెట్టుకొని స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండాలని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు.